S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘రాష్ట్రంలో నియంత పాలన’

రేణిగుంట, ఆగస్టు 2 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని వైకాపా జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి నిప్పులు చెరిగారు. మంగళవారం ఉదయం వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని బంద్ శాంతియుతంగా కొనసాగుతుంటే తిరుపతిలో తమను అరెస్ట్‌చేసి రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు విషయంలో ఇరుక్కొని రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి తాకట్టుపెట్టారని, ఎక్కడ ప్రధాని చంద్రబాబును ఓటుకు నోటు విషయంలో జైలుకు పంపుతారో అనే భయంతో ప్రత్యేక హోదా కోసం చేస్తున్న బంద్‌ను నీరుగార్చేందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలను, అరెస్ట్ చేయిస్తున్నట్లు ఆరోపించారు. ప్రత్యేకహోదా అనేది ప్రతి ఆంధ్రుడి హక్కు అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవిధంగా ప్రవర్తించిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదని, తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రేణిగుంటలో బంద్ నిర్వహిస్తున్న వైకాపా మండల నాయకులను, వామపక్ష నేతలను సుమారు 60 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా అరెస్టయిన వారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు బైండోవర్ చేసుకొని విడుదల చేశారు. అరెస్టయిన వారిలో సర్పంచ్ పాక్యముత్తు, వైకాపా నాయకులు తిరుమలరెడ్డి, అబ్దుల్ హరి, మోహన్‌నాయుడు, బాలసుబ్రహ్మణ్యం, సుజాత, గిరి, నాగరాజు, రాజేష్‌రెడ్డి, వామపక్ష నేతలు రమణ, తులసీరాజన్, ఇతర కార్యకర్తలు ఉన్నారు.