S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టర్ సమీక్ష

కుప్పం, ఆగస్టు 2:రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఈనెల 8,9వ తేదిల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈపర్యటనపై జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్నిప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతోపాటు కుప్పం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్న ఈకార్యక్రమంలో 8,9 రెండు రోజులు కాకుండా కేవలం 8వతేది మాత్రమే చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించే విధంగా సలహాలు, సూచనలు అధికారుల వద్ద నుంచి తీసుకున్నారు. రెండు రోజులు పర్యటన బదులు అన్ని ఒకే రోజే కుదించే విధంగా సిఎం పిఎ మనోహర్‌తో పాటు కుప్పం నియోజకవర్గ నాయకులతో చర్చించారు. హంద్రీ-నీవా కాలువ పనుల పరిశీలన, ఎప్ సిఐ గోడౌన్ ప్రారంభోత్సవం, ఆర్‌అండ్‌బి అతిథిగృహం వద్ద డబుల్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలన, శాంతీపురం మండల పరిధిలోని ఓ ప్రజాప్రతినిధి కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు తెలిసింది.