S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

270 కేజీల ఎర్రచందనం పట్టివేత

పలమనేరు, ఆగస్టు 2: పలమనేరు సమీపంలోని నాగమంగళం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిత్తూరు నుండి బెంగళూరు వైపు వెళ్తున్న టాటా సఫారి వాహనంలో ఉన్న 270కిలోల ఎర్రచందనాన్ని, టాటా సఫారిని సీజ్ చేసినట్లు పలమనేరు సిఐ సురేంద్రరెడ్డి తెలిపారు. టాటా సఫారిలో ఉన్న ఎర్రచందనం దొంగలు పరారైయ్యారు. వివరాల్లోకి వస్తే పలమనేరు వైపు బెంగుళూరుకు వెల్తున్న టాటా సఫారి వాహనం నాగమంగళం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లారు. పోలీసులు వెంటనే వాహనాన్ని పరిశీలించగా అందులో సుమారుగా 270కేజీలు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 10లక్షలు ఉంటుందని సిఐ పేర్కొన్నారు. వాహనం నెంబరు ఆధారంగా వివరాలు సేకరించి స్మగ్లర్లను పట్టుకుంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో పలమనేరు ఎస్సై లోకేష్, ఎఎస్సై, సిబ్బంది తదితరులు ఉన్నారు.