S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి

ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 2: ఖమ్మంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్ పాపాలాల్ తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో కమిషనర్ బొనగిరి శ్రీనివాస్‌తో కలసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై సోమవారం కరీంనగర్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి కెటిఆర్ పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఖమ్మం నగరాన్ని సుందరీకరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మేయర్ వెల్లడించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మంచినీరు, రోడ్లు అభివృద్దిపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో 12చోట్ల ఆధునిక పద్దతిలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నామన్నారు. అందులో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు నిర్మించనున్నామని, నిర్వహణ బాద్యతలు మహిళలకే అప్పగించనున్నట్లు చెప్పారు. అదే విదంగా కార్పొరేషన్ నిధులతో అవసరమైన ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ప్లాస్టిక్ వాడకంతో పాటు ఫ్లెక్లీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్లాస్టిక్ ఫ్రీ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. అన్ని పార్కులు అభివృద్ది, చెత్తసేకరణకు ట్రాకింగ్ సిస్టం వెహికల్స్‌ను ఉపయోగించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా వెహికిల్ ఏ ప్రాంతంలో ఉందో గుర్తించవచ్చన్నారు. రద్దీ ప్రాంతాల్లో జంక్షన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఖమ్మాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో డెప్యూటి మేయర్ బత్తుల మురళీ, కార్పొరేటర్ పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కోటితో పార్కుల అభివృద్ధి
నగరంలోని పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ పాపాలాల్ తెలిపారు. మంగళవారం నగరంలో వివిధ ప్రాంతాల్లోని పార్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పార్కులు సందర్శకులకు అనువుగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పార్కులను ఆధునీకరించేందుకు కోటి ఎనిమిది లక్షలను వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డెప్యూటి మేయర్ మురళీ, కార్పొరేటర్లు నీరజ, వలరాజు, అధికారులు రంగారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.