S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నామ్ నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఆగస్టు 2: జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) నిర్వాహణకు మార్కెట్ కార్యాలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేపడుతున్నట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పాలకుర్తిప్రసాదరావు వెల్లడించారు. నామ్ పథకం నిర్వాహణ ఏర్పాట్లుపై ఆంధ్రభూమితో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలో 44 వ్యవసాయ మార్కెట్‌లను ఎంపిక చేసిందని, ఇందులో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కూడా ఉందన్నారు. ఇప్పటికే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఈ బిడ్డింగ్ విధానంలో లావాదేవీలు జరిగాయని, దీంతో నామ్ పథకంను సులభంగా నిర్వహించవచ్చన్నారు. నామ్ పథకం ద్వారా మార్కెట్ లావాదేవీలలో పూర్తి పారదర్శకతను తీసుకరావచ్చన్నారు. నామ్ పథకం ద్వారా జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారులు, కొనుగోలుదారులు ఎక్కడి నుంచైనా రైతుల వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయవచ్చన్నారు. మార్కెట్ యార్డులను కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఈ విధానంలో వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను ఎలక్ట్రానిక్ వేదికలో ప్రదర్శించడం ద్వారా వేరువేరు ప్రాంతాల నుంచి వ్యాపారస్థులు ఆన్‌లైన్ ద్వారానే సరుకును చూసి దేశంలో ఏ మార్కెట్ నుంచి అయినా రైతుల నుంచి కొనుగోలు చేసుకోవచ్చన్నారు. నామ్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా మార్కెట్ యార్డులో రైతుల సరుకులకు మంచి గిరాకీ లభించే అవకాశం ఉందన్నారు. వ్యాపారులు, కొనుగోలుదారుల మధ్య పోటీతత్వం పెరిగి రైతుల సరుకులకు లాభసాటి ధరలు పలికే వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఈ విధానం ద్వారా రైతు తన దగ్గరలోని మార్కెట్ నుంచే దేశంలో అధిక ధర చెల్లించే మార్కెట్ యార్డులోని వ్యాపారులకు సరుకును విక్రయించవచ్చన్నారు. దేశ వ్యాప్తంగా 214 మార్కెట్లలో ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనుండగా, మన రాష్ట్రంలో 44 మార్కెట్‌లను నామ్‌కు ఎంపిక చేయడం విశేషం అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఇప్పటికే ఇన్‌గేట్ విధానాన్ని ప్రవేశపెట్టామని, రైతుల సరుకులు మార్కెట్ యార్డులోకి రాగానే నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. త్వరలోనే నామ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి విధానాన్ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నిర్వర్తించనున్నట్లు తెలిపారు. దీనిపై మార్కెట్ సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చామని, వ్యాపారులకు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. మార్కెట్‌లో లైసెన్స్ కలిగిన వ్యాపారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు.