S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పులకించిన గోదారి తీరం

భద్రాచలం, ఆగస్టు 2: దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీరామదివ్యక్షేత్రంలో అంత్యపుష్కరాల సంబురాలు అంబరాన్ని అంటాయి. పోటెత్తిన భక్తులతో గోదావరి తీరం పరవశించింది. పుష్కరుడు సైతం పులకించాడు. పుష్యమి నక్షత్రం సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామికి మహాపట్ట్భాషేకం, మంగళవారం వేళ ఆంజనేయస్వామికి అభిషేకం, పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆండాళ్లమ్మ తిరునక్షత్రోత్సవాలతో రామాలయం కిటకిటలాడింది. అమావాస్య పిండ ప్రదానాలకు మహత్తరమైనది కావడంతో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు రామయ్య దర్శనంతో పాటు ఆయన పట్ట్భాషేకాన్ని సైతం తిలకించి తరించారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు మదినిండా ఆనందం నింపుకుని తిరుగు పయనమయ్యారు.
కమనీయం...శ్రీరామపట్ట్భాషేకం
అంతకు ముందు ఉదయం గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చిన అర్చకులు అంతరాలయంలో సుప్రభాత సేవ చేశారు. స్వామికి సేవాకాలం అనంతరం బాలభోగం సమర్పించారు. ప్రాకార మండపంలో నిత్యకల్యాణం చేశారు. మరో వైపు మంగళవారం సందర్భంగా గాలిగోపురంనకు ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి, వడలు, అప్పాలు, 108 నిమ్మకాయలతో మాలలు నివేదన చేశారు. అభిషేకం అనంతరం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తి ప్రాకార మండపానికి శ్రీరామచంద్ర మహాప్రభువు పట్ట్భాషేకోత్సవానికి తరలివచ్చారు. రామయ్య నిత్యకల్యాణం అనంతరం పుష్యమి సందర్భంగా మహాపట్ట్భాషేకం క్రతువు ప్రారంభమైంది. సహస్రనామార్చన, క్షేత్ర మహత్యం, పట్ట్భాషేక సర్గను ఎస్టీజీ కృష్ణమాచార్యులు వివరించారు. విష్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, అష్టాదిక్పాలక ఆవాహన, పంచకలశావాహన, వెండిపాదుకలు, చామరాలు, ఛత్రము, రాజదండం, రాజముద్రిక, దివ్యాభరణములు, ముత్యాలహారం, మహాకుంభప్రోక్షణ, కిరీట అర్చన, కిరీటధారణ, మహానివేదన, మహదాశీర్వచనం, కట్నకానుకల సమర్పణ, దివ్యహారతితో పట్ట్భాషేక మహోత్సవం ముగిసింది. ఇదిలా ఉండగా గోదావరి తీరంలో శ్రీసీతారామచంద్రస్వామి ప్రచారమూర్తులకు అభిషేకం చేశారు. పుష్కరస్నానాలు చేసిన భక్తులకు దర్శనం కల్పించారు. పుబ్బా నక్షత్రం సందర్భంగా అండాళ్లమ్మ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
నదీహారతులు:పుష్కరాల మూడవ రోజు మంగళవారం సాయంత్రం గోదావరి తీరంలో గోదావరి మాతకు నదీహారతులు ఘనంగా జరిగాయి. భక్తుల జయజయధ్వానాలు, వేదాపారాయణాలు, రామనామ స్మరణలు నడుమ అర్చకులు గోదావరికి పూజలు చేశారు. కుంభ, ద్వయ, అష్ట, ద్వాదశ, నక్షత్ర హారతులు ఇచ్చారు. ఎంతో వేడుకగా నదీహారతుల కార్యక్రమం భక్తిప్రవత్తులతో జరిగింది.