S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆరాధనోత్సవాల ఏర్పాట్లు పరిశీలన

మంత్రాలయం, ఆగస్టు 2: మంత్రాలయంలో ఈ నెల 17 నుండి శ్రీ రాఘవేంద్రస్వామి 345 ఆరాధనోత్సవాల సందర్భంగా మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు మంగళవారం సాయంత్రం ప్రధాన వీధులను, మఠం నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే రాఘవేంద్ర కూడలిలో ఉన్న ఆర్చి మరమ్మతు పనులను, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరుగుతున్న రోడ్డు, కాలువ పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆరాధనోత్సవాలకు వచ్చే భక్తులకు సదుపాయాల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు కలుగు కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. పీఠాధిపతి వెంట మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతాచార్, అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి, ఇంజినీర్ కోణాపూర్ సురేష్, మఠం సిబ్బంది ఉన్నారు.