S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హోదా సాధించేంత వరకూ ఉద్యమిస్తాం

నందికొట్కూరు/మిడుతూరు, ఆగస్టు 2:రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేంత వరకూ ఉద్యమిస్తామని ఎమ్మెల్యే ఐజయ్య స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం మంగళవారం వైకాపా, వామపక్షాల ఆధ్వర్యంలో నందికొట్కూరు, మిడుతూరులలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో వైకాపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌టిసి బస్టాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికార టిడిపి ప్రత్యేకహోదా కోసం పోరాడకుండా కేంద్రం వద్ద కేవలం ప్యాకేజీలకే ప్రాధాన్యత ఇవ్వడంతో కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుందన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వనపుడు కేంద్రంలో టిడిపి నాయకులు మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోకరత్నం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా కోసం పట్టణంలో బంద్ చేపట్టారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.