S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తంగెడంచ సీడ్ హబ్‌కు జాతీయ స్థాయి గుర్తింపునకు కృషి

నంద్యాల, ఆగస్టు 2 : జిల్లాలోని తంగెడంచ సీడ్ ఫారంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 300 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలకు చెందిన విత్తన ఉత్పత్తి పనులు ప్రారంభించామని, 2017 నాటికి పూర్త్తిస్థాయిలో 500 ఎకరాల్లో విత్తనోత్పత్తి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తంగెడంచ సీడ్ ఫారం స్పెషల్ ఆఫీసర్ విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఆయన మాట్లాడుతూ తంగెడంచలో సీడ్ హబ్ కోసం కేటాయించిన 500 ఎకరాల్లో కంపచెట్లతో అడవిలా ఉండిందని, దానిలో 300 ఎకరాలు సాగుకు యోగ్యమయ్యే విధంగా అభివృద్ధి చేసి వివిధ పంటలకు చెందిన బ్రీడర్ సీడ్ పంటను వేశామన్నారు. తంగెడంచ ఫారంకు సాగునీటి వసతి కల్పనకు కూడా పనులు చేపట్టామన్నారు. తంగెడంచ ఫారంలో సీడ్ టెక్నాటజి రీసెర్చ్ సెంటర్, ప్రయోగశాల, ఉత్పత్తి అయిన విత్తనాలను నిల్వ చేసే గోదాముల నిర్మాణం, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. సీడ్ ఫారంలో విత్తన ఉత్పత్తికి అవసరమైన వౌళిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ ఏడాది సీడ్ ఫారంకు నాబార్డు ద్వారా రూ.1.85 కోట్లు, రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన ద్వారా రూ.1.5 కోట్లు, పప్పు దినుసుల జాతీయ ఉత్పత్తి కేంద్రం నుండి రూ.85 లక్షలు నిధులు అందుబాటులోకి వచ్చాయన్నారు. తంగెడంచ సీడ్ ఫారంలో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2017 ఖరీఫ్ నాటికి మిగిలిన 200 ఎకరాలు సాగులోకి తీసుకువచ్చి అన్ని రకాల పంటలకు సంబంధించిన బ్రీడర్ సీడ్‌ను ఉత్పత్తిచేస్తామన్నారు. దీంతో తంగెడంచ ఫారంకు జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని, అలాగే నంద్యాల ప్రాంతం నుండి తరలిపోయిన విత్తనోత్పత్తి సంస్థలు తిరిగి ఇక్కడికి వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు తమ విత్తనాలు తామే ఉత్పత్తి చేసుకొనే విధంగా వారికి ఫౌండేషన్ సీడ్‌ను ఇచ్చి వారి పొలాల్లోనే డెమో ప్లాట్లు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సలహాలు, సూచనలు అందించి విత్తనాలు ఉత్పత్తి చేసుకోవడమేకాక (ఎంట్రర్‌ప్యూనర్) విత్తన వ్యాపారిగా కూడా అభివృద్ధి చేస్తామన్నారు. రైతులు విస్తృత స్థాయిలో విత్తన ఉత్పత్తి చేయడం వల్ల ప్రైవేటు కంపెనీలపై అధిక ధరలు చెల్లించి కొనాల్సిన అవసరం లేదని, తమ గ్రామానికి అవసరమైన విత్తనాలను తామే ఉత్పత్తి చేసుకోవడమేకాక మిగులు విత్తనాలను వివిధ కంపెనీలకు అమ్ముకొనే విధంగా లైసెన్సింగ్ విధానాన్ని తీసుకువస్తామన్నారు. తంగెడంచ సీడ్ ఫారంలో రైతులకు విత్తనోత్పత్తిలో ఆధునిక పరిజ్ఞానంతో పూర్తిస్థాయి శిక్షణ ఇస్తామన్నారు. ఈ ఏడాది తంగెడంచ ఫారంలో పది ఎకరాల విస్తీర్ణంలో వరి (బిపిటి -5204), ఆర్‌ఎన్‌ఆర్, ఎన్‌ఎల్‌ఆర్ రకాలను సాగుచేస్తున్నామని, ఫౌండేషన్ విత్తనాలు రైతులకు ఇచ్చి వారి వద్ద నుండి విత్తనాలను తామే కొనుగోలు చేసే ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నూనెగింజల సాగులో 6 ఎకరాల్లో నువ్వులు, 5 ఎకరాల్లో ఆముదం, 4 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పువ్వు బ్రీడర్ విత్తనాల సాగు చేపట్టామన్నారు. అలాగే 20 ఎకరాల్లో కంది, శనగ, పెసర, మినుము తదితర పప్పు దినుసుల విత్తన పంటలను సాగుచేశామన్నారు. కొర్ర పంట పది ఎకరాల్లో సాగుచేశామని ఆయన తెలిపారు. అలాగే వర్షాధారంగా వరి పంట సాగుచేసేందుకు సాలు వరి పద్దతిలో 10 ఎకరాల్లో వరి పంట వేశామని, సాగునీరు పుష్కలంగా అందిన పక్షంలో ఈ పొలంలోని వరి పంటను సాంప్రదాయ పద్ధతిలో సాగుచేసి ఫౌండేషన్ సీడ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో తంగెడంచ సీడ్ ఫారం శాస్తవ్రేత్త డాక్టర్ జాఫర్‌బాషా, నంద్యాల ఆర్‌ఎఆర్‌ఎస్ శాస్తవ్రేత్తలు డా. రామారావు, డా. మునికృష్ణ, డా. చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.