S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణా పుష్కరాల తర్వాతే డబుల్ డెక్కర్

విశాఖపట్నం, ఆగస్టు 2: ట్రయిల్ రన్‌కే పరిమితమైన డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టనుంది. కృష్ణా పుష్కరాలు పూర్తయిన తరువాతనే దీనిని నిర్వహిస్తారని తెలిసింది. ఊహించని విధంగా ఇటీవల విశాఖ రైల్వేస్టేషన్‌కు వచ్చిన డబుల్ డెక్కర్ రైలు ట్రయిల్ రన్ నిర్వహించుకుని వచ్చిన రోజునే తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి దాని జాడే లేకపోవడంపట్ల ప్రయాణికులు నిరాశ చెందుతున్నారు. మరోపక్క వాల్తేరు డివిజన్ అధికారులు దీని నిర్వహణపై దృష్టిపెడుతున్నారు. ఎపుడు వస్తుందోనంటూ ఎదురు చూస్తున్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో అన్ని ఫ్లాట్‌పారాల నుంచి దీనిని నిర్వహించేందుకు అనువుగా ఉందని కూడా ట్రయల్ రన్ ద్వారా నిర్ధారించారు. అన్ని ప్లాట్‌ఫారాలు దీనిని నిలుపేందుకు అనుకూలంగా ఉండటంతో ఏదీ ఖాళీగా ఉన్న దీనిని సులభంగా ఆ ప్లాట్‌ఫారం మీదకు తీసుకురావచ్చు. దీనివల్ల ఎటువంటి ఆలస్యం లేకుండా నిర్వహించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే థర్డ్ ఏసి టికెట్ చార్జీలనే దీనిలో ప్రయాణికులు చెల్లించే విధంగా రైల్వే ప్రకటించనున్నట్టు తెలిసింది. అయితే ఏఏ మార్గాల మధ్య దీనిని నిర్వహిస్తారనేదే సందిగ్ధంగా మారింది. దక్షిణమధ్యరైల్వే జోన్‌కు చెందిన ఈ డబుల్ డెక్కర్ రైలు ఈస్ట్‌కోస్ట్‌రైల్వేకు సంబందించి కేవలం 16 కిలోమీటర్ల పరిధిలోనే నడువనుంది. అందువల్ల దీని నిర్వహణ బాధ్యతలు దక్షిణమధ్యరైల్వే చూడాల్సి ఉంటుంది. దీని కారణంగానే ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఇది పట్టాలెక్కనుందనేది తేలడంలేదు. తొలుత విశాఖ-విజయవాడ మధ్య నిర్వహించాలని నిర్ణయించిన దక్షిణమధ్యరైల్వే విశాఖ-తిరుపతి మధ్య నడపడటం వలన భక్తులకు ఎక్కువుగా ప్రయోజనకరంగా ఉంటుందనే ఆలోచన చేస్తుంది. అందువల్ల ఈ అంశంపైన స్పష్టత వచ్చిన తరువాత ఈలోపు కృష్ణా పుష్కరాలు పూర్తయితే పూర్తిస్థాయిలో దీనిని నిర్వహిస్తారనేది స్పష్టమవుతోంది. కాగా ఉత్తరాంధ్ర ప్రజానీకం మాత్రం దీనిని కృష్ణ పుష్కరాల నుంచి నిర్వహిస్తారనే ఆశలు పెట్టుకున్నారు.