సూర్య సరసన కీర్తి
Published Wednesday, 3 August 2016‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. మొదటి చిత్రానికే భారీ ప్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె, ఆ తరువాత తెలుగులో మరే చిత్రమూ చేయలేదు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న కీర్తికి బంపర్ ఆఫర్ దక్కింది. స్టార్ హీరో సూర్య హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్గా అవకాశం దక్కిందట. ప్రస్తుతం సూర్య ‘సింగం-3’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన హీరోగా తెరకెక్కే చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా ఓకె అయినట్టు వార్తలొస్తున్నాయి. దాంతోపాటు స్టార్ హీరో విజయ్ సరసన కూడా హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది కీర్తి.