పట్టాలు తప్పిన పళని ఎక్స్ప్రెస్ : ప్రయాణికులంతా సురక్షితం
Published Thursday, 4 August 2016చెన్నై: కృష్ణగిరి జిల్లా దసంపట్టి ప్రాంతంలో గత రాత్రి చెన్నై-పళని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఇంజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. 3 గంటలపాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపేసి తర్వాత తిరిగి ప్రారంభించారు.