S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంసెట్ లీకేజీ బాధ్యులపై చర్య తీసుకోవాలి

బెజ్జంకి, ఆగస్టు 4: ఎంసెట్ లీకేజీకి సంబంధించిన బ్రోకర్లపై చర్యలు తీసుకోవాలని, అందుకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలని కోరుతూ కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గురువారం బెజ్జంకి తహశీల్దార్ ఈశ్వరయ్యకు వినితిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఎంసెట్ 1,2 పేపర్ల లీకేజీపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని, ఈ లీకేజీలో పెద్దల భాగస్వామ్యం ఉన్నందువల్లే బ్రోకర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గతంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసిన విధంగా కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలని, కెసిఆర్ ఫాం హౌస్‌లో కొనసాగడం వలనే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బెజ్జంకి ఎక్స్‌రోడ్‌లో రూ.28 లక్షలతో రాజీవ్ జిమ్ సెంటర్ నిర్మించినా రెండేళ్లైనా అది ఉపయోగించుకోవడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. బెజ్జంకి మండల పార్టీ పక్షాన తహశీల్దార్ ఈశ్వరయ్యకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి డైరెక్టర్ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి కచ్చు రాజయ్య, మహిపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, నాగమల్లేశం, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.