S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిఓ 123పై అప్పీల్‌కు వెళ్తామనడం అవివేకం

కరీంనగర్, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123 జిఓను హైకోర్టు రద్దు చేసినా ప్రభుత్వానికి జ్ఞానోదయం కలుగలేదని, ఈ విషయంలో తిరిగి అప్పీల్‌కు వెళ్తామనడం అవివేకమని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం భూ నిర్వాసితులకు ఎంతో మేలు చేస్తుందని, అలాంటి చట్టాన్ని వదిలి ప్రభుత్వం జిఓ 123 జారీ చేయడం బాధాకరమని తెలిపారు. భూసేకరణ తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసినట్లుగా ఉందని, ప్రభుత్వం చేసే కార్యక్రమంలా లేవని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పు పట్ల ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సి ఉండగా, అప్పీల్‌కు వెళ్తామనడం శోచనీయమన్నారు. జిల్లా ప్రజలు నీటికోసం అరిగోస పడతా ఉంటే, జిల్లాలోని ఎల్లంపల్లి నుంచి సిద్ధిపేట, మెదక్ ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లంపల్లి పైపులైన్లు వెళ్లిన ఐదు నియోజకవర్గ ప్రజలకు నీరందించిన తరువాతనే సిద్ధిపేట, మెదక్‌లకు తరలించాలని డిమాండ్ చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన ఈ జిల్లాకు సిఎం కెసిఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మాకు నీళ్లు ఇవ్వకుంటే పైపులు పగులగొడతామని మాట్లాడిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారని? ప్రశ్నించారు. సిఎం కెసిఆర్‌ను అడిగే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపిలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఐదు నియోజకవర్గ ప్రజలకు ఎల్లంపల్లి పైపులైన్‌కు ఔట్‌లెట్స్ పెట్టి నీరందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై శుక్రవారం హుస్నాబాద్, రామగుండం, పెద్దపల్లి, మానకొండూర్, కరీంనగర్ నియోజకవర్గ కేంద్రాలలో కాంగ్రెస్ పక్షాన నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మృత్యుంజయం పిలుపునిచ్చారు.