S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పునరావాస కాలనీకి తరలి వెళ్లాలి

వెల్గటూరు, ఆగస్టు 4: మండలంలోని ముంపు గ్రామమైన కోటిలింగాల గ్రామానికి వెళ్లే రహదారి మధ్యన వంతెన గోదావరి నీటిమట్టం పెరగడంతో మునిగిపోయింది. రాకపోకలు మొత్తంగా నిలిచిపోవడంతో గురువారం కలెక్టర్ నీతూప్రసాద్ మునిగిపోయిన వంతెనను సందర్శించారు. కోటిలింగాల ముంపు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయంగా రహదారి ఏర్పాటు చేయాలని ముంపు బాధితులు కలెక్టర్‌ను కోరారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు కూలీ డబ్బులు రాలేదని బాధితులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. తక్షణమే రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తుల కోసం చర్యలు చేపట్టాలని ఆర్‌డిఓ అశోక్‌కుమార్, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. వెల్గటూరు సమీపంలోని ధర్మపురి మండలం పాశాయిగాం గ్రామం నుండి కోటిలింగాలకు వెళ్లే రైతుల ఎడ్లబండ్ల బాటను గ్రావెల్ వేసి, మరమ్మతులు చేసి కోటిలింగాల గ్రామస్థులకు రహదారిని పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వంతెనపై నీరు చేరడంతో ప్రజలు ఎవరు వంతెనపై నుండి వెళ్లవద్దని, తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోదావరి బ్యాక్ వాటర్ మరింత పెరుగుతున్నందున వీలైనంత త్వరగా కోటిలింగాల పునరావాస కాలనీకి గ్రామ ప్రజలు తరలివెళ్లేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రతీ ఒక్కరు ఇండ్లు కట్టుకోవాలని, అన్ని వసతులు కల్పిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. అనంతరం చెగ్యాం ముంపు గ్రామాన్ని గురువారం కలెక్టర్ నీతూప్రసాద్, జెసి శ్రీ దేవసేన సందర్శించారు. చెగ్యాం పాఠశాలలోని ముంపు బాధితులను కలెక్టర్, జెసిలు కలిసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పరిహారం అందని 34 మంది ముంపు బాధితులు కలెక్టర్‌కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. జనరల్ అవార్డు ప్రకారం అయిన తరువాత పరిహారం పెంచరాదని, అవసరమైతే జనరల్ అవార్డు ప్రకారం పరిహారం చెల్లించుటకు సిద్ధంగా ఉన్నామని, ఇట్టి డబ్బులు తీసుకొని తదుపరి మీరు కోర్టును ఆశ్రయించవచ్చని బాధితులకు తెలిపారు. వీరి వెంట ప్రభుత్వ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.