S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భర్త సాహసం... వాగుతో పోరాటం

దుమ్ముగూడెం, ఆగస్టు 4: గిరిజన ప్రాంతానికి చెందిన ఓ నిండు గర్భిణిని కాపాడేందుకు భర్త, స్థానికులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగుతో పోరాడి గెలిచిన సంఘటన ఇది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం పైడాగులమడుగు గ్రామానికి చెందిన గొంది లక్ష్మి అనే గర్భిణికి బుధవారం అర్థరాత్రి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆశావర్కర్లు, కుటుంబ సభ్యులు కలిసి ఆటోలో పర్ణశాల పిహెచ్‌సీకి బయలుదేరారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కె.లక్ష్మీపురం, చింతగుప్ప గ్రామాల మధ్య వాగు ఉధృతి తగ్గకపోవడంతో అక్కడి చేరుకున్న వారు 108కి సమాచారం అందించారు. సిబ్బందితో అత్యవసర వాహనం లక్ష్మీపురం చేరుకుంది. అవతల ఉన్న గర్భిణి ఇవతల ఒడ్డుకు రావడానికి అవకాశం లేకపోవడంతో సుమారు గంటపాటు అక్కడే నొప్పులతో వేదనకు గురయింది. పురిటి నొప్పులు పెరిగి ఆమె ఆటోలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంతసేపటికి ఆమెకు ఫిట్స్ మొదలయ్యాయి. దీనితో భర్త శ్రీరాములు, పైడాకులమడుగు యువకులతో కలిసి సాహసం చేశారు. ఒక రోప్‌ను అవతలి ఒడ్డు వరకు ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ ట్యూబ్‌లో గాలి నింపి దానిపై బాలింతను పడుకోబెట్టారు. యువకులు నీటిలోనే మునుగుతూ ఆ ట్యూబ్‌ను వాగు అవతల ఉన్న 108 వద్దకు చేర్చారు. అక్కడ సిద్ధంగా ఉన్న 108కు పర్ణశాల సిబ్బంది తల్లిబిడ్డను ఎక్కించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

చిత్రం.. బాలింతను వాగులో ట్యూబ్ ద్వారా తీసుకొస్తున్న దృశ్యం