S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహంతొలగింపు

అమరావతి, ఆగస్టు 4: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక మ్యూజియం సెంటర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయాక రాత్రికి రాత్రే ఎన్‌టిఆర్ విగ్రహాన్ని తొలగించారు. రాష్ట్రంలో ఎటువంటి విగ్రహాల అనుమతికి అవకాశం లేకపోయినా అధికార దర్పంతో కొందరు నాయకులు స్థానిక నాయకుల అండదండలతో ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం ఏర్పాటుపై వైసిపి నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించి స్థానిక పోలీసుస్టేషన్‌లో నియోజకవర్గ సమన్వమకర్త కావటి మనోహర్‌నాయుడు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు కాస్త చినికి చినికి గాలివానలామారి పార్టీ హైకమాండ్ దృష్టికెళ్లడం, మెయిన్‌రోడ్డులో ఆర్‌అండ్‌బి, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం వల్ల విగ్రహాన్ని తొలగించివేశారు. ఎట్టకేలకు ఎన్‌టిఆర్ విగ్రహం తొలగించడంతో కృష్ణా పుష్కరాల సందర్భంగా వివాదం ఏర్పడుతుందేమోనన్న సమస్య సానుకూలంగా పరిష్కారమైంది. ఈ విగ్రహం తొలగింపుతో ప్రతిపక్షాల డిమాండ్ నెరవేరింది.