S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోటి మందికి పుష్కర ఏర్పాట్లు

గుంటూరు, ఆగస్టు 4: కృష్ణా పుష్కరాలలో భక్తులకు స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓపెన్ ఫోరం నిర్వహించారు. పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ కాంతిలాల్ దండే పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అందరి భాగస్వామ్యంతో పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగుకోట్ల మంది సందర్శకులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకుతగిన వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ప్రజలు సహకరించాలని కోరారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ గత పుష్కరాలకు జిల్లాలో 40 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారని, ఈ ఏడాది 80 ఘాట్లలో కోటి మందికి పైగా తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా అధికార యంత్రాంగాన్ని అన్ని ఘాట్ల వద్ద కేంద్రీకృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, డీఆర్వో కె నాగబాబు, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.