ఓయూలో ప్రొఫెసర్ల ధర్నా
Published Friday, 5 August 2016హైదరాబాద్: ఏడాది నుంచి సకాలంలో జీతాలు అందడం లేదని, విశ్రాంత ప్రొఫెసర్లకు పెన్షన్లు అందడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పారు. వేతనాలు చెల్లించడం లేదని ఓయూ పరిపాలనా భవన్ ఎదుట శుక్రవారం వారు ధర్నా నిర్వహించారు. అలవెన్స్లు ఇవ్వడం లేదని, ఈ నెల ఇంకా వేతనాలు అందలేదని, ఇదే కొనసాగితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఓయూ ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.