S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మెట్టలో పట్టు సాగుతో అధిక లాభాలు

గోపాలపురం, ఆగస్టు 4: మెట్టప్రాంతంలోని రైతాంగం పట్టు పరిశ్రమ సాగు చేయడం ద్వారా అధిక లాభాలు అర్జించ వచ్చని పట్టు పరిశ్రమ శాఖ ఉప సంచాలకులు ఎ సుబ్బరామయ్య అన్నారు. మండలంలోని రాజఆంపాలెం గ్రామంలోని రైతులు కాకర్ల హరిరామకృష్ణ, పెనుబోతుల లక్ష్మీశాంతి పొలంలో నిర్మించిన పట్టు పురుగుల షెడ్లను సుబ్బరామయ్య గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలోని భూములు ఇసుకతో కూడిన తేలికపాటి నేలలు కావడంతో పట్టు సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు. పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా ఈ పంటను పండించడం వల్ల రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధించ వచ్చన్నారు. మల్బరీ తోటకు బిందు సేద్య పద్ధతిలో నీటిని అందించడం ద్వారా నాణ్యత, తేమ శాతాన్ని పెంచవచ్చన్నారు.