S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నెలల తరబడి కిచెన్‌షెడ్ల నిర్మాణాలా?

ఏలూరు, ఆగస్టు 4 : జిల్లాలో కిచెన్ షెడ్ల నిర్మాణం ఏడాది పడుతుంటే దాన్ని బట్టి అధికారుల పనితీరు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం విద్యాశాఖాధికారులతో కలెక్టర్ భాస్కర్ సమీక్షించారు. జిల్లాలో వారం వారం విద్యాశాఖ ప్రగతి తీరుపై తానుసమీక్ష నిర్వహిస్తున్నా పనితీరులో మార్పు లేకపోతే ఎలా? రెండు రోజుల్లో కట్టే కిచెన్‌షెడ్లు నెలల తరబడి నిర్మించకపోవడం ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే భోజన తయారీ కోసం సరైన కిచెన్ షెడ్లు సకాలంలో ఎందుకు నిర్మించలేకపోతున్నారని ప్రశ్నించారు. నిధులున్నా నిధులు నిర్వర్తించకపోవడానికి కారణం ఏమిటని సకాలంలో పనులు చేయించలేనప్పుడు బాధ్యతలునిర్వహించడం దండగన్నారు. గృహ నిర్మాణ శాఖ, సర్వాశిక్ష అభియాన్ ఇంజనీరింగ్ విభాగం కిచెన్ షెడ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం చేయడం వల్ల పాఠశాలల్లో విద్యార్ధులే నష్టపోతున్నారని చెప్పిన పని సకాలంలో చేయలేనప్పుడు సమీక్షించడం దండగని ఇలాంటి స్థితిలో ఈ అధికారులతో పనిచేయించడం కూడా కుదరదని త్వరలోనే విద్యాశాఖను ప్రక్షాళన చేసి సమర్ధవంతంగా పనిచేసే విధానాన్ని ఏర్పాటుచేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 1043 కిచెన్ షెడ్లకు గాను 856 పూర్తయ్యాయని 107 కిచెన్ షెడ్లు నిర్మాణ దశలో ఉండగా ఇంకా 80 కిచెన్ షెడ్లు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయంలో డి ఇవో డి మధుసూధనరావు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ బ్రహ్మానందరెడ్డిలు తప్పు నీదంటే కాదు నీదంటూ ఒకరినొకరు కలెక్టరు ఎదుటే వాదోపవాదాలకు దిగడంతో కలెక్టరు అసహనం వ్యక్తం చేస్తూ ఇద్దరిలోనూ సమన్వయం లోపించిందని, నా ఎదుటే చిన్నపిల్లల్లాగా ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం, పంచాయితీ పెట్టుకోవడం చాలా శోఛనీయమని అన్నారు. కార్యక్రమంలో డి ఇవో డి మధుసూధనరావు, సర్వశిక్ష అభియాన్ పివో డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి డి ఉదయ్‌కుమార్, డివిజనల్ విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.