S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని కృషి

తాడేపల్లిగూడెం, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషిచేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా రైసు మిల్లర్స్ అసోసియేషన్ హాలులో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయం, కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ 2019 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయన్నారు. చిన్న వ్యాపారులకు ముద్ర యోజన పథకం ద్వారా ఉపాధి పొందేందుకు రుణాలు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరూ తెలుసుకుని వినియోగించుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున నీరు-చెట్లు, రోడ్డు నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం ద్వారా ప్రతి పల్లెకు రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశాన్ని టూరిజం కేంద్రంగా తీర్చిదిద్ది అధిక సంఖ్యలో పర్యాటకులు దేశాన్ని సందర్శించేలా ప్రధాని మోదీ కృషిచేస్తున్నారన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పౌరుడు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన జీవితం కోసం మరుగుదొడ్డిని తప్పనిసరిగా నిర్మించుకోవాలన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం 7 మండలాల పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు కేటాయించిందన్నారు. కృష్ణా డెల్టా రైతాంగానికి నీరందించడం ఒక చరిత్ర అని అన్నారు. ఐఐటి మాదిరిగా నిట్‌ను తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలకు అందుబాటులో ఉండేందుకు తాడేపల్లిగూడెంలో ఏర్పాటుకు కేంద్రం సహకరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన, అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దారు పి నాగమణి, ఎంపిడిఒ వై దోశిరెడ్డి, మల్లికార్జునరావు, ఛాంబర్ కార్యదర్శి సిహెచ్‌ఎస్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.