S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృతజ్ఞతలు

మన జీవితంలో మలుపు తిప్పే వ్యక్తులకు, మనల్ని ఆనందంగా ఉంచే వారికీ కృతజ్ఞతలు చెప్పడం ఎంతో అవసరం అని చెప్పిన ‘ఓ చిన్న మాట’ మహత్తరంగ ఉంది. వైద్యం వ్యాపారం అయిపోయిందని ఒక పాఠకుడు చింతించారు. భూమి, నీరు, ఉద్యోగాలు అన్నీ వ్యాపారాలుగా మారిపోవడానికి అసలు కారణం విద్య వ్యాపారంగా మారటమే. రాజకీయాలు వ్యాపారంగా మారిపోవడం మరో ముఖ్య కారణం. నిత్యా మీనన్, కీర్తి సురేష్, శ్రీదివ్య లాంటి ఈనాటి యువ తారలు గ్లామరస్‌గా కనిపిస్తూనే నటనకు ప్రాధాన్యం ఇచ్చి స్కిన్‌షోని నిరాకరించడం ముదావహం. నా తెలివి అమోఘం, నాకంతా తెలుసు అనుకోవడం పెద్ద పొరపాటని ‘వినదగు’ ఉపదేశం చేయడం బాగుంది.
-బి.స్నేహమాధురి (పెద్దాపురం)
చిన్న కునుకు
లంచ్ అయ్యాక చిన్న కునుకు తీయడం వల్ల ప్రయోజనాలు ‘సండే గీత’లో బాగా వివరించారు. పని ఒత్తిడిలో బాగా అలసిపోతే మెదడు తనకు కావలసిన విశ్రాంతి తనే తీసుకుంటుంది. మన ప్రమేయం లేకనే కళ్లు మూసుకుపోతాయి. ఆ విధంగానే పార్లమెంటులో కునుకు వీరులుగా దేవెగౌడ, రాహుల్ ప్రసిద్ధులయ్యారు. దర్శకత్వం చేపట్టమని కోరిన పాఠకునికి ముందు ప్రేక్షకుల్ని వెదకమని మీరు ఇచ్చిన సమాధానం భలేగా నవ్వించింది. పక్షుల్లో క్రూరమైనవీ ఉంటాయనీ, ‘శతపాది’ నిజంగా అన్ని కాళ్లు ఉండవని ఒకవేళ కాళ్లు తెగిపోయినా మళ్లీ మొలుస్తాయని తెలిసి ఆశ్చర్యపోయాం. నేల మీద బతికిన తొలి జీవి విశేషాలు ఆకట్టుకున్నాయి.
-ఎ.చైతన్య (వాకలపూడి)
స్నేహ బంధం
స్నేహితుల దినోత్సవం సందర్భంగా జరుపుకునే విశేషాలను చక్కగా వివరించారు. స్నేహ బంధపు మాధుర్యాన్ని తెలుపుతూ, రక్త సంబంధీకులకన్న స్నేహబంధం స్థిరంగా ఉంటుందని, పురాణ కాలం నుండి స్నేహబంధం ఉందని, స్నేహ బంధం శాశ్వతంగా, పటిష్టంగా ఉంటుందని తెలిపారు. గజి‘బిజి’గా, యాంత్రికంగా మారిపోతున్న జీవితానికి స్నేహబంధం ఎడారిలో నీటి చెలమలా కనిపిస్తుందని, బాధలు, సమస్యలతో కూడిన జీవితానికి స్నేహమే ఉపశమనం అని చెప్పిన తీరు మాకెంతో నచ్చింది. స్నేహితులు ఎంత దూరంలో ఉన్నా, ఖండాంతర దూరంలో ఉన్నా సామాజిక మాధ్యమం నిత్యం వారిని కలుపుతుంది. చక్కటి వ్యాసాన్ని అందజేసినందుకు కృతజ్ఞతలు.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
నమామి గంగే
ఈ వారం కవర్‌స్టోరీ ‘నమామి గంగే’ చాలా బాగుంది. గంగానది గురించిన సమగ్ర సమాచారాన్ని అందించారు. గురు పూర్ణిమ సందర్భంగా వచ్చిన గురువే దైవం వ్యాసం బాగుంది. మధ్యపేజీలో బాలల కోసం ‘సిసింద్రీ’ పేజీలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. ఈ వారం కథ ఎస్వీ కృష్ణగారి ‘ఆమె జీవితాన్ని జయించింది’ ఎంతగానో అలరించింది. ఇక మల్లాది కథలు, రాజశేఖర్ ‘కుంచెం తేడా’లో పొలిటికల్ కార్టూన్లు ఆదివారం అనుబంధానికి మరింత వనె్న తెస్తున్నాయి. ఇక సండే గీత, ఓ చిన్న మాట రెండూ కూడా మాలో స్ఫూర్తినీ, కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఈ వారం చిన్న మాటలో ‘డబ్బు’ ప్రాధాన్యతను చక్కగా తెలియజేశారు.
-మార్టూరు అజయ్‌కుమార్ (మురికిపూడి)
గురువే దైవం
గురుపూర్ణిమ సందర్భంగా అందించిన ‘గురువే దైవం’ వ్యాసం మమ్మల్ని ఎంతగానో అలరించింది. అలాగే కవర్‌స్టోరీ ‘నమామి గంగే’ స్ఫూర్తిదాయకంగా ఉంది. అక్షరాలోచనాలులోని గూడ అంజయ్యపై కవిత చాలా బాగుంది. ఈ వారం కథ ఆసక్తికరంగా ఉంది.
-గుండు రమణయ్య (పెద్దాపూర్, కరీంనగర్)
పవిత్ర భావం
గంగ అనగానే ప్రతి భారతీయుడి హృదయం పవిత్ర భావంతో ఉప్పొంగుతుంది. కానీ పవిత్రంగా పూజించే ప్రజల అజ్ఞానం, స్వార్థం, నిర్లక్ష్యాల వల్ల గంగ కలుషితం అయి శుద్ధి ఖర్చులు మురుగు కాలువలో పోసిన పన్నీరు అవుతోంది. కవర్‌స్టోరీలో చెప్పిన విషయాలు ఆలోచింపజేసాయి. గోపాలంగారు ఉదారంగాను ఉచితంగాను పాఠకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. మా మరో ప్రపంచ యాత్ర ఉల్లాసభరితంగా ఉంది. ఎవరి ప్రాణం వారికి తీపి అని చెప్పిన సిసింద్రీ కథ బాగుంది.
-పి.శుభలక్ష్మి (కాకినాడ)
తమాషాగా ఉంది
క్రైం కథ నిజానికి దయ్యం కథే అయినా తమాషాగా ఉంది. చంపబడిన వారు దయ్యాలవుతారని మనమూ నమ్ముతాం. మన దయ్యాల కథలన్నీ పగ, ప్రతీకారం చుట్టూ తిరిగితే ఈ కథలో దయ్యం మంచిగా కనిపిస్తుంది. బతికి ఉండగా తను చేసిన తప్పులు ఇప్పుడు ఒప్పుకుంటూ భర్త పట్ల సానుభూతి చూపుతూ ఆత్మహత్యకు ప్రేరేపించి అతడు దయ్యమై తనను కలుసుకున్నాక అతడిని నరకంలో తోయించడం భలే ప్రతీకారం. ఎవరూ ఊహించని కానె్సప్ట్! నమ్మండి ఇది నిజంలో చెప్పిన అడవిరాముడు అలెగ్జాండర్ కథ నిజంగా నమ్మలేనంత ఆసక్తికరంగా ఉంది.
-కె.సుధీర్ (శ్రీనగర్)