S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సెంటిమెంట్ భామ!

‘‘నేను ఏదైనా చేశాకే చెబుతా. చేయక ముందు ఏదీ చెప్పడం నాకు చేతకాదు. చాలామంది తారలు నేను ఇది చేస్తున్నా.. అది చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటుంటారు. తీరా అదీ..ఇదీ చేయక పప్పులో కాలేసి బోల్తాకొడతారు. అందుకే వాళ్లు చేస్తున్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింటున్నాయి. అంతేకాదు... వాళ్ల కెరీర్ కూడా అదే స్థాయిలో దిగజారుతోంది’’ అంటూ పెద్ద పెద్ద కబుర్లే చెబుతోంది అందాల భామ సమంత. తెలుగు, తమిళ చిత్రాల ద్వారా నటిగా అనతికాలంలో టాప్ రేంజ్‌కు దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ చిత్రాల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తుంది. అందుకే కెరీర్ ఇలా హాయిగా సాగుతోంది. చేసే చిత్రం, పోషించే క్యారెక్టర్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునే ఈ బ్యూటీపై ఎలాంటి రూమర్స్ పుట్టుకురాలేదు. అడపా దడపా చిన్నాచితక రూమర్స్ షికారు చేసినా పెద్దగా పట్టించుకోలేదు సమంత. ‘ఇలాంటివి పట్టించుకుని కూర్చుంటే కెరీర్ ఇక అంతే’అన్న సంగతి ఈ ముద్దుగుమ్మకు బాగానే తెలుసట. ‘‘నేను చేసే ప్రతీ చిత్రం..నేను వేసే ప్రతి అడుగు చాలా గోప్యంగా ఉండేలా చూసుకుంటాను. అలా చూసుకోవడం వల్లే ఈ రోజు నేనీస్థాయిలో ఉండగలిగాను. టాలీవుడ్..కోలీవుడ్..ఇలా రెండు పడవల ప్రయాణం సాఫీగా జరగడానికి కారణం నేను తీసుకున్న జాగ్రత్తలే’’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.