S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాన

వాన
బాట రెమ్మకు గొడుగు పూలు
గొడుగు పూలపై ముత్తెపు చినుకులు

వాన
రైతు గుండెలో ఆనందపు చెలక
ఆనందపు చెలకన తలెత్తి ఆకుమడి

వాన
పిల్లల మనసంతా మొలిచే రెక్కలు
మొలిచిన రెక్కల తడుస్తూ సీతాకోకచిలుకలు
వాన
చెట్లను కౌగిలించుకున్న చిరుసవ్వడులు
చిరుసవ్వడుల జాలువారుతూ పచ్చదనం

వాన
పొదువుకుంటూ, పరిమళిస్తూ నేలతల్లి
నేలతల్లి ఒడిలో పసిపాపలా ఆడుతూ
వాన

-నారాయణమూర్తి తాతా 9298 004 001