S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్చ్..సన్నీ!

బాలీవుడ్ అంతా ఇప్పుడు సన్నీలియోన్‌ని చూసి ‘ప్చ్..సన్నీ’అంటున్నారంతా. అందుకు కారణాలు లేకపోలేదు. శృంగారతారగా ఓ వెలుగు వెలిగి యువతరం గుండెల్లో గుప్పెడు మనసును దోచుకున్న ఈభామ అటు తర్వాత బాలీవుడ్‌లో ప్రవేశించి తన సత్తాను చాటింది. హిందీ చిత్రపరిశ్రమకు వచ్చిన కొత్తల్లో అందరూ సన్నీ చూసి హేళనగా మాట్లాడుకున్నారు. పోర్న్‌స్టార్ భామ బాలీవుడ్‌లోకా? అంటూ అందరూ ఎగతాళి కూడా చేశారట. అవన్నీ సన్నీ లైట్‌గా తీసుకోబట్టే నేడు అందరికీ తన నటనతో..వచ్చిన క్రేజ్‌తో సవాల్ విసురుతోంది. భర్తతో కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ సెక్సీ అతడి సహకారంతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తూ రివ్వున దూసుకెళుతోంది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా తన ప్రతిభను చాటుకుంటూ అడల్ట్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా కూడా మారిపోయింది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే మనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మనమేంటో నిరూపించుకోవాలన్నదే తన ఆశయంగా చెబుతోంది ఈ సుందరాంగి. తాజాగా షారుఖ్‌ఖాన్‌తో ‘రారుూస్’లోనూ ఓ ప్రత్యేక పాటలో మెరుపులు కురిపించింది. మరో పక్క ఐటమ్‌పాటలతోనూ అదరగొడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే..బాలీవుడ్‌లో సంపాదించిన డబ్బుతో తన భర్తతో కలిసి బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ‘లస్ట్’పేరుతో ఓ పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ ఇటీవలే కొత్తగా ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు తన భర్త ప్రోత్సాహం మరచిపోలేనంటూ చెప్పుకొచ్చింది. వాహ్..సన్నీ వాహ్..! అని కొందరంటుంటే.. మరికొందరేమో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సన్నీని చూసి ‘ప్చ్..సన్నీ’అంటున్నారు.

-సమీర్