S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సో..స్వీటీ!

బాలీవుడ్‌లో ‘దబాంగ్’ బ్యూటీగా విశేష ప్రాచుర్యం పొందిన అందాలతార సోనాక్షి సిన్హా హాట్ హాట్‌గా అందరి హృదయాలను గిలిగింతలు పెడుతోంది. చేస్తున్న చిత్రాలు..పోషిస్తున్న పాత్రలు వేటికవే భిన్నంగా వుండేలా చూసుకుంటూ కెరీర్‌లో ముందుకు పరుగులు తీస్తోంది. గ్లామర్ ఒక్కటే కాదు.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకుంటోంది. బాలీవుడ్‌లో ప్రవేశించిన నాటి నుంచి వరుస కమర్షియల్ విజయాలతో మెప్పిస్తూ అందరి చేత ప్రశంసలందుకోవడమే కాదు.. ఆయా చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరచుకుంటోంది. అయితే ఈ పరుగులో కొన్ని పరాజయాలు తప్పలేదు. వీటిని సోనాక్షి పట్టించుకోకుండానే దారిని కూడా మళ్లించింది. ఆ దారిలోనే ఇప్పుడు ‘అకిరా’, ‘్ఫర్స్-2’చిత్రాల్లో యాక్షన్‌కు స్కోప్ వున్న పాత్రలను ఎంతో చాలెంజింగ్‌గా తీసుకొని పోషిస్తోంది. ‘నూర్’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో చేతినిండా చిత్రాలతో బిజీ బిజీగా వున్న ఈ బ్యూటీ చేస్తున్న పాత్రలన్నీ ఒకదానికొకటి భిన్నమైనవే కావడం విశేషంగా చెప్పుకుంటున్నారు సినీ జనాలు. ఈ విషయం గురించి సోనాక్షి చెబుతూ- ‘‘నాకు నేనే పోటీగా భావిస్తాను. నేను ఎవ్వరినీ అనుకరించను. నా దారి నాదే. నా చిత్రాలు నావే..నా పాత్రలూ నావే’’అంటూ చెప్పుకొచ్చింది స్వీటీ సోనాక్షి!!

-సమీర్