S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆనందహేతువు

ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆనంద హేతువు అంటూ ప్రాణాయామం గురించి ‘సండే గీత’లో చక్కగా చెప్పారు. రకరకాల రంగులతో శరీరం మీద పెయింటింగ్‌లు వేసుకోవడం, ఆ విధంగా వేసుకున్న బాడీ పెయింటింగ్‌ల పోటీలు నిర్వహించడం తెలిసి ఆశ్చర్యపోయాం. హైకోర్టు విభజనపై తెలంగాణ అనవసర రాద్ధాంతం చేస్తోంది. నిజానికి ఇద్దరు సి.ఎంలు, సిజెఐ కలిసి తీసుకోవలసిన నిర్ణయం అది. యాగానికి ఆయన ఈయన్ని ఆహ్వానిస్తారు. శంకుస్థాపనకు ఈయన ఆయన్ని ఆహ్వానిస్తారు. కాని కోర్టు విభజనకు ఇద్దరూ కలవడం లేదు. ఇదో రకం రాజకీయం! న్యాయాన్ని రోడ్డుకి ఈడ్చారు!
-బి.సోపాని (సూర్యారావుపేట)
విలువ
ఆదివారం అనుబంధంలో నాకిష్టమైన శీర్షిక ‘ఓ చిన్న మాట’. ఈ శీర్షికలో ‘కృతజ్ఞత’ మనసును కదిలించింది. మనల్ని కని పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నలను, చదువు చెప్పిన గురువును, మానవ జన్మ ఇచ్చి మనకు విలువ కలిగించిన భగవంతునికి ప్రతిరోజూ కృతజ్ఞతలు తెలుపుకోవటం అదృష్టంగా భావించాలి. కృతజ్ఞత అన్నది కోట్ల మిలియన్ డాలర్ల కన్నా విలువైనది. అలాగే ‘నిజాయితీ’ కథ బాగుంది. మన దేశంలో నీతి నిజాయితీలు కాగితాలకే పరిమితమైన మాటలు అనిపిస్తున్నాయి. లక్షల కొద్దీ వేతనాలు తీసుకుంటున్న అధికారులు లంచం తీసుకోవటం చూస్తూంటే డబ్బు పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో అర్థమవుతుంది. మన దేశంలో సామాన్యుడు రోజల్లా గొడ్డు చాకిరి చేసినా నెలకు రూ.5 వేలు రావడం లేదు. లక్షల్లో వేతనాలు తీసుకొంటూ కూడా లంచానికి అలవాటు పడిన ప్రబుద్ధులు ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు. మంచి కథని అందించినందుకు కృతజ్ఞతలు.
-కోలపాక శ్రీనివాస్ (బెల్లంపల్లి)
స్నేహ మాధుర్యం
‘నేస్తం! నువ్వే సమస్తం’ అంటూ స్నేహ మాధుర్యాన్ని గురించి ఎంతో చక్కగా చెప్పారు. స్నేహం గొప్పదనం చూపించే సినిమాలూ వచ్చాయి. ఫ్రెండ్‌షిప్ డే జరుపుకోవటం ఉల్లాసకరమే. అయితే ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడటం విచారకరం. ‘చెరపకురా చెడేవు’ అన్న తెలుగు నీతిని మరొకసారి ఆంగ్ల క్రైం కథ ‘మనస్సాక్షి’ నిరూపించింది. క్రైం డజ్ నాట్ పే అని కూడా అనిపించింది. హిందువులే కాక డాక్టర్ టక్కర్ లాంటి విదేశీయులు కూడా పునర్జన్మను నమ్మడం ఆశ్చర్యకరం.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)
దయ్యం-దైవం!
సిసింద్రీ కథ ‘మర్యాదస్థుడు’ కనువిప్పు కలిగించే విధంగా ఉంది. ఇంటి లోపల దయ్యం, ఇంటి బయట దైవంలా అగుపించే మనస్తత్వం మారిపోవాలి. చక్కటి శీర్షికలతో.. కవర్‌స్టోరీతో వారం వారం మమ్మల్ని అలరిస్తున్న ఆదివారం అనుబంధం అంటే మాకెంతో ఇష్టం.
-కె.ఎన్.రావు (కావలి)
సాహసం
‘అదృష్టం’ కథ సాహసం, పరోపకార బుద్ధి ఉంటే అదృష్టం వరిస్తుందని తెలియజేసింది. సినిమా షూటింగ్‌కై వెళ్తున్న అనిల్, పెద్దావిడ మెడలో చైన్ కొట్టేసిన ముఠాని సాహసంతో పట్టుకోవడం.. ఆ పెద్దావిడ ఎసిపి తల్లి కావడం.. ఇలా అంతా అదృష్టమే కాదు సాహసం వల్ల జరిగింది అని కూడా అనవచ్చు.
-సరికొంత శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
‘నేస్తం..’
‘నేస్తం.. నువ్వే సమస్తం’ చాలా బాగుంది. స్నేహానికి మించింది ఏముంది. మంచి స్నేహితులు ఉన్నవారు కోటీశ్వరుల కంటే గొప్పవారని నా అభిప్రాయం. తృప్తి, బహుమతి చాలా బాగున్నాయి. అక్షరాలోచనాలులో ఒక తుపాకీ అరవై ప్రాణాలు చాలా బాగుంది. ఈ డౌట్ నాకు చాలాసార్లు వచ్చింది. తుపాకీల లైసెన్సులు నియంత్రించే సత్తా లేక కాదు. మనసు లేదు. ఆ చనిపోయేది వాళ్ల వాళ్లయితే గాని దాని విలువ తెలియదు. జన్మజన్మల బంధం కూడా బాగుంది.
-డి.వి.తులసి (రామవరప్పాడు)
నువ్వే సర్వస్వం
ప్రతిఫలం ఆశించకుండా నిలిచేది స్నేహం. హృదయాన్ని స్విచ్చ్ఫా చేయకుండా ఉంచితే జీవితాంతం పనిచేసే అద్భుత నెట్‌వర్క్ స్నేహం. ఐవరీకోస్ట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మొసలి ఆకారంలో ఇల్లు కట్టుకోవడం.. విభిన్న రూపాల్లో భవనాలు నిర్మించుకోవాలన్న ఇష్టమే కారణం. షూ ఆకారంలో చర్చి, మొసలి ఆకారంలో ఇల్లు.. బావున్నాయి. ‘అక్షరాలోచనాలు’లో ఒక తుపాకీ అరవై ప్రాణాలు కవిత బావుంది. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం తుపాకీలకు లైసెన్సులు ఇచ్చి అరవై ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదాన్ని తీసుకువచ్చింది.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
కొత్త గెటప్
ఆదివారం అనుబంధంలోని శీర్షికలన్నీ దేనికదే హైలైట్. ఆదివారం అనుబంధం కొత్త గెటప్ చాలా బాగుంది. రూపుమారినా స్ఫూర్తి మారలేదు. చక్కని శీర్షికలు, మంచిమంచి కథలు, ఆలోచింపజేసే చక్కని చారిత్రక సీరియల్.. ఇలా ఆదివారం అనుబంధంలో ప్రతి అంశమూ చాలా బాగుంటోంది.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం)