కురుల సుందరి
Published Saturday, 20 August 2016ఈమె రంగురంగుల కురుల సుందరి. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో ఆమె ఇప్పుడో సంచలనం. రంగుల్లో సింగారించుకున్న ఆమె పొడవైన కురులే ఆమెకు ఆ పేరు తెచ్చిపెట్టాయి. ఈమె శిరోజాల పొడవు నాలుగు అడుగులు. అతిపెద్దవైన ఆ కురులకు కాస్త విభిన్నమైన రంగులద్ది, జాగ్రత్తగా అలంకరించుకుని ఇలా ప్రదర్శనలివ్వడం ఆమెకు అలవాటు. ఇలా తీసుకున్న వేలాది చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఆమెకు మరింత ఇష్టం. శిరోజాలను పెంచడం, సంరక్షించడం మామూలు విషయమేంకాదు. పైగా వీటితో ఓ సెలబ్రిటీగా మారిపోవడం అంత ఈజీకాదు. ఇంతకీ ఆమె పేరు తెలుసా. త్రిష లీబెర్ట్. ఆమె వయసు కేవలం 31.