నిర్జీవం+సృజన =సజీవం
Published Saturday, 20 August 2016వినీల ఆకాశమే సాహిత్య పుష్టికి
బహు విశాల దృశ్య కావ్యం
కారు చీకటులను తరిమే సూర్యోదయమే
సాహిత్యానికి ఎక్స్ కిరణాల దివ్యదృష్టి
దోబూచులాడే వాయువే
భిన్న అభిరుచుల సాహిత్యానికి
మూల ప్రాణ ధాతువు
తేలియాడే మబ్బులే
ఊహల లోకాల కవిత్వానికి
సయ్యాటల ఊయలలు
కిలకిలరావాలతో ఎగిరే పక్షులే
మనోస్వైర విహార రచనలకు
వినసొంపైన శృతిలయలు
సకల జీవాధార సాగరమే
దాహాన్ని తీర్చే సాహిత్యానికి
స్వేద జలధారలు
భ్రమణం - పరిభ్రమణాల భూదేవియే
వాగ్దేవి భాషిత సుమధుర సాహిత్యం
పంచభూతాల మేధ మథనంలో
సృజనాత్మకంగా ఆవిష్కృతమయ్యే
సాహిత్యమే సజీవ శక్తిమయం - స్ఫూర్తిదాయకం.