S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కష్టం

రాయడం ఎంత సులభమో అంత కష్టం. వర్గీకరణ, విషయ సేకరణ ఎక్కువమందికి అర్థమయ్యేట్టు అందించటంలో ప్రయాస గురించి తనదైన శైలిలో గోపాల విజ్ఞాని రాయడం అలరించింది. మన పండుగలు ఆచార వ్యవహారాల్లోని సెన్స్, సైన్స్ గురించి ఆయన వివరంగా రాయాలని మా ఆశ. ఇక కళ్ల కింద సంచుల వల్ల ఏ మాత్రం ఉపయోగం లేకుండా బాధపడే చేపలు, మాటు వేసి చంపేసే హంతక బగ్‌ల గురించి చదివి ఆశ్చర్యపోయాం. కురుక్షేత్రం ఓ విధంగా అంతుర్యద్ధమే అంటూ ‘వినదగు’ విషయాలు చెప్పారు రచయిత. రెండు దేశాల మధ్య ఇల్లు ఒక సగం ఒక దేశంలో రెండో సగం ఇంకో దేశంలో ఉండటం గురించి చదివాం. ఇప్పుడు లైబ్రరీ!
-బి.స్నేహమాధురి (పెద్దాపురం, తూ.గో.జిల్లా)
ఇబ్బంది పెట్టవద్దు
‘్భభౌ’ కథ కడుపుబ్బ నవ్వించింది. తమ ఇంట్లో అద్దెకున్నవారు ఇంటిని శుభ్రంగా ఉంచడం లేదని వామన్‌రావ్ దంపతులు వారిని ఖాళీ చేయించడం, ఆ తర్వాత వచ్చే శంకర్రావు దంపతులు ఇద్దరే అని, వారు కుక్కను పెంచుకుంటున్నప్పటికీ అది ఇంటికి రక్షణగా ఉంటుందని భావించి వామన్రావు దంపతులు వారికి ఇంటిని అద్దెకివ్వడం, ఆ తరువాత శంకర్రావ్ పెంచుకుంటున్న కుక్కతో అడుగడుగునా పడిన అవస్థలు హాస్యస్ఫోరకంగా రచించారు. ఆ తరువాత బలవంతంగా శంకర్రావ్ దంపతులను ఖాళీ చేయించడం, ఆ తరువాత వచ్చిన వారు మంచివారని భావించి ఇంటిని అద్దెకివ్వగా చివరకు మళ్లీ ‘కుక్క’ కష్టాలు పునరావృతం అవడం బాగా నవ్వించింది. అయితే ఇది చదివిన తరువాత ఎవరూ తాము అద్దెకుంటున్న ఇంటి యజమానులను ఇబ్బంది పెట్టవద్దని గ్రహిస్తే మంచిది.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
దయాగుణం
ఒక పసివాడు బిచ్చగానికి ఐదు రూపాయల బిళ్ల దానం చేయడం చూసి పెద్దలు దయాగుణంలో పసిపిల్లల్లా మారితే మంచిదే అని చెప్పిన ఓ చిన్న మాట గొప్పగా ఉంది. అయితే ఇక్కడో చిన్న తిరకాసుంది. బిచ్చగాళ్లలో చాలామందికి పని చేసి సంపాదించుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వారికి దానం చేస్తే సోమరితనాన్ని ప్రోత్సహించడమే. వాళ్ల ఆదాయం సామాన్య ఉద్యోగుల కంటే ఎక్కువే అని ఒక సర్వే తేల్చింది.
-కె.సుధీర్ (శ్రీనగర్)
కదిలించింది
ఆదివారం అనుబంధంలో చింటూ కార్టూన్ చూడగానే మనసు చెప్పలేని బాధతో చలించిపోయింది. అందులో చిన్నపిల్లవాడు చింటూ ఇలా అంటాడు. ఓ ఇంట్లోంచి భగవద్గీత వినిపిస్తూంటే - మమీ ఈ ఇంట్లో ఎవరో పోయినట్టున్నారే’. ఈ కార్టూన్ను ఎవరూ తేలికగా తీసుకోకూడదు. ఈనాడు గీత అపవిత్ర కార్యాలకు ఉపయోగించడం సిగ్గుచేటు. ప్రవచనకర్తలు, మఠాధిపతులు, పండితులు ఎంత మొత్తుకుంటున్నా ఈషణ్మాత్రం పట్టించుకోని ప్రజలనేమనాలి? చివరకు చిన్నపిల్లలు కూడా ఎక్కడయినా ఘంటసాల ‘గీత’ వినపడితే అక్కడేదో పార్థివ దేహం ఉన్నట్టేనని అర్థం చేసుకుంటున్నారు. మన జనాలకు బుద్ధి వికాసం ఎప్పటికి కలుగునో భగవాన్.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
స్ఫూర్తిదాయకం
జీవితంలో నశ్వరమైన వస్తువుల ద్వారా లభించే భౌతికమైన సంతోషం కంటే అంతర్గత సంతోషం శాశ్వతమైనదని, తృప్తినిచ్చే జీవితానికి దారితీస్తుందన్న ‘సండే గీత’ స్ఫూర్తిదాయకంగా ఉంది. రియో ఒలింపిక్స్‌పై కవర్‌స్టోరీ విజ్ఞానదాయకంగా ఉంది. గత ఒలింపిక్స్ కంటే ఈసారి భారత జట్టు మెరుగైన ప్రదర్శన కోసం మంచి కృషి చేసిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, భారత ఒలింపిక్స్ సంస్థలు టాప్స్ పథకం ద్వారా జట్టులో నూతనోత్సాహం నింపారు. ప్రధాని నరేంద్ర మోదీ జట్టును ప్రత్యేకంగా సమావేశపరచి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో క్రికెట్‌ను కాకుండా ఇతర క్రీడలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
ఎక్స్‌లెంట్!
భౌతిక సంతోషంకన్నా అంతర్గత సంతోషం మిన్న. ఎదుటి వారిలో సంతోషం నింపడంలో ఎంతో సంతోషం ఉంటుందని చెప్పిన ‘సండే గీత’ ఎక్స్‌లెంట్! ఒక పాఠకుని ప్రశ్నకు జవాబుగా కాంగ్రెస్ లేకున్నా ఆ అభివృద్ధి జరిగేదే అన్న మీ సమాధానం బాగుంది! అక్షరాలోచనాల్లో ‘జీవితంలో నువ్వు’ అన్న కవిత మరీ ముఖ్యంగా ‘బూడిద నుంచి మొలకెత్తిన విత్తులు చూడు, కూల్చడం గొప్పకాదు నిర్మించడమే కష్టం’ అన్న భావన మరీమరీ బాగుంది! వెరసి ఆదివారం అనుబంధం సూపర్.
-బి.సోనాలి (సూర్యారావుపేట)

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.