S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శైశవానందహేల

అమ్మ ఒడి
హంసతూలికా తల్పంలో
ఆదమరచి నిద్రపోతున్న
ఆనందాల శిశువు
భువిపైనే
దివిని కంటున్నాడు
వాడికి అన్ని సౌఖ్యాలూ
దిగదుడుపే!
తల్లి ఒడి
చక్రవర్తి సింహాసనమే
అపురూపంగా దొరికిన
ఇంద్ర పదవే!
అదొక అంతరిక్ష స్థానమే!
ఆ శిశువు ఆనందానికి
బ్రహ్మానందాలే చిన్నబోతున్నాయి!
ఆ శిశుత్వం
మానవ జీవితంలో
ఒక్కసారే లభ్యం!
దాన్ని నెమరువేసుకుంటే
జీవనమే ధన్యం!!
*

-అయాచితం నటేశ్వరశర్మ 9440468557