S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేడెక్కిపోతున్న వార్తలు!

దేశం గురించి
వార్తాపత్రికలు చదూతుంటే
మెదడులో నాడులు
అక్షరాలతో సహా వేడెక్కిపోతున్నాయి
సరిహద్దుల్లో సంఘటనలు
రాష్ట్రాల్లో పెట్రేగిపోతున్న
అత్యాచారాలు, దోపిడీలు...
రాజకీయం పరస్పర బలోపేతాల
కార్యాచరణలో
దేశ బలోపేతం విస్మరిస్తున్న చిహ్నాలు!
ప్రపంచ పటం మీద తన ప్రత్యేకత కోల్పోతున్న
తీవ్ర సంఘటనలు...
మేల్కొందాం! మేల్కొందాం!
సామాన్యుని రక్షణ దిశగా
అన్ని పార్టీలు ముక్తకంఠంతో నినదించాలి...
ఏలిన వాడు ఎవరైతేనేం
మనమంతా భారతీయులం!
మంచికి సహకరించి ప్రతిష్ట పెంచుదాం!!

-గుడిమెట్ల గోపాలకృష్ణ 8977474958