S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనామిక

ఎక్కడో
హతాశయులైన
స్వప్నంలో నుండి
జారిపడింది
ఈ గులాబీ
రెక్కలు నలిగి
నేలను వాలి
అనాగ్రతమైన
నీడలోకి రాలింది
ఈ పరిమళాన్ని
ఏ మనసులో దాస్తావు
అరవిరిసిన ఈ
రూపాన్ని ఏ వొడికి
చేరుస్తావు?
నీవు ఓ అనామికవే
ఇన్ని చీకటి అలల మధ్య
ఇన్ని నలిగిన కాలాల మధ్య
ఈ ముడి సంధ్యలో
ఈ గులాబీని
ఏ గూటికి చేర్చగలవు
ఈ ప్రపంచం
పద్మవ్యూహాల పూల పల్లకి
ఎంతగా పరవశిస్తుందో
అంతగానె కాటేస్తుంది
ఈ విధి వంచిత నాటకంలో
రెండు కన్నీళ్లకన్నా
మించిన మరే సౌభాగ్యము
లేదు, ఈ ముగింపు
ఏ సుఖాంతతరాలకు
చేరలేదు
కాలం ప్రవహించే
ఓ స్వప్న నౌక.

-రవి ఆర్కే 9849294127