S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
నేను లోగడ లాల్‌ఖిలా (్ఢల్లీ), షాజహాన్ కోట (ఆగ్రా), దౌలతాబాద్ కోట (ఔరంగాబాద్), గోల్కొండ (కుతుబ్‌షాహీ, హైదరాబాద్) వగైరా చూశాను. ఎందులోనూ ‘టాయిలెట్స్’ కానీ ‘ఎటాచ్డ్ బాత్’లు కానీ కనపడలేదు. స్థానిక గైడ్స్ రొటీన్ చరిత్ర తప్ప ఈ పాయింట్ వివరించలేదు. మీరు చెప్పగలరా? చక్రవర్తులు, షాహెన్‌షాలు కాలకృత్యాలకు ఎక్కడికి వెళ్లేవారు?
ఇంటి మధ్యలో మరుగుదొడ్డి ఇప్పటి పద్ధతి. ఈ కాలపు కళ్లతో పూర్వపు లోగిళ్లను చూస్తే ఇలాంటి డౌట్లే వస్తాయి. శతాబ్దాల పూర్వపు కోటల్లోనే కాదు మన తాత ముత్తాతల ఇళ్లలోనూ టాయిలెట్లు ఉండేవి కావు.

కేవీసీ శర్మ, కావలి
‘నాకు నచ్చిన సినిమా/ పాట’ శీర్షికకు తెల్ల కాగితంపై వ్రాసి పంపించవచ్చా? నేనలాగే పంపించాను చాలా. పడ్డం లేదు. అందుకే అడగడం అనుమానం వచ్చి. సమాధానం?
ఎలాగైనా పంపవచ్చు. స్పష్టంగా ఉంటే చాలు.

గోవుల వ్యవహారంపై ప్రధాని యూటర్న్ తీసుకున్నట్లుంది. ఇలాగైతే హిందువుల మనోభావాలు దెబ్బతిని, చేతులు కట్టుకొని కూర్చుంటారు. అప్పుడు మరలా విచ్చలవిడి ఐపోదా? ఎవరో ఏదో అన్నారని, చేస్తున్నారని ఆయన అంత ఫీలైపోవడం సరికాదేమో! ఇది త్రేతాయుగం కాదు. ‘గోసంరక్షణ’ అమలు జరిగి తీరాల్సిందే. ఈ దేశంలో, కఠినంగానైనా సరే. అన్నిటికీ ‘రాజ్యాంగం’ గురించి మాట్లాడేవాళ్లు, ఈ విషయంలో ఎలా ఉల్లంఘిస్తారు? కుహనా లౌకిక వాదుల్ని, మొసలి కన్నీరు కార్చే కుల, మత నాయకుల్ని లెక్క చేయకూడదు. ఏమంటారు?
ఔనంటాను.

గుండు రమణయ్య, పెద్దాపూర్
‘గోరక్షణ’ పేరిట అరాచకాలు చేస్తున్న వారిపై చర్యలు ఉంటాయా?
అరాచకాలు చేసేవారిని తప్పక శిక్షించవలసిందే. కాని గోరక్షకులందరూ అసాంఘిక శక్తులు, అరాచక వాదులు అన్నట్టు ప్రచారం చేయటం తగదు.

‘ఎమ్సెట్-3’ అయినా చక్కగా సాగుతుందా?
4కి తెలియాలి.

ప్రొఫెసర్ కె.ఎన్.రావు, కావలి
హోటళ్లు, స్వీట్‌హౌస్‌లపై మున్సిపల్ సిబ్బంది దాడులు అని వార్తలు. కొన్నిటిని సీజ్ చేసినట్లు వార్తలు. సాధారణంగా (ఎప్పుడో తప్ప) అలాంటి నిబంధనలు పాటించని, నాణ్యత లోపాలు ఇత్యాదులు గల ఆ హోటళ్లు, తీపిబండారాల అంగళ్ల పేర్లు సంబంధిత అధికారులు ప్రకటిస్తే/ ప్రచురిస్తే ప్రజలు చైతన్యవంతులౌతారు గదా? పేర్లు దాచుటలో మతలబు ఉంటుందాండీ?
అధికారులు దాడి చేయగానే నేరం రుజువైనట్టు కాదు. పేర్లు రాస్తే కొన్ని సందర్భాల్లో లీగల్ చిక్కులు వస్తాయి. అందుకని పత్రికలు జాగ్రత్తగా ఉంటాయి. నేరం కోర్టులో నిర్ధారణ అయ్యాక పేర్లు ప్రకటించడం రివాజు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
నరహంతకుడు నరుూమ్‌కు సహకరించిన రాజకీయ, అధికార గణం పేర్లను బయటపెడతారంటారా? వారి మీద చర్యలు తీసుకుంటారా?
ఆశ పెట్టుకోవడం దండుగ. ఇప్పటికి ఇలాంటివి ఎన్ని చూడలేదు.

నరుూమ్ మరణంతో రౌడీయిజం కొంతవరకైనా తగ్గుతుందని ఆశించవచ్చా?
ఇంకా పెరగవచ్చు. ఏది ఎలా చేయాలో తెలిసింది కనుక.

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
ప్రపంచ ప్రఖ్యాత క్రీడ క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చలేదేమిటి?
అది కొన్ని దేశాల్లోనే ప్రఖ్యాత క్రీడ. చాలా దేశాలకు అదేమిటో తెలియదు.

నిరాల, సికిందరాబాద్
సార్క్ సమావేశాలకు ఆతిథ్యం వహిస్తున్న పాకిస్తాన్ మన హోంమంత్రి ప్రసంగాన్ని కట్ చేయడం, భోజన సమయంలో ఆ దేశ హోంమంత్రి హాజరు కాకుండా తప్పించుకోవడం - అదే మన దేశానికి ముప్పు తలపెట్టిన ముషారఫ్‌కు మనం ఘన స్వాగతం పలకడం - ఇవన్నీ చూస్తుంటే పాక్ విషయంలో మనం తెగతెంపులు చేసుకుంటే ఎలా ఉంటుందంటారు?
దీనికి దమ్మూ, ధైర్యం కావాలి.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
దేవాలయములు, పుణ్యక్షేత్రములు సందర్శించే సమయాన ఆర్భాటముగా అలంకరణ, సెల్‌ఫోన్‌లు ఆలయ ప్రాంగణములో వినియోగించుట సిగ్గుచేటుగా ఉంది. తిరుమల శ్రీహరి వారి ప్రాంగణములో పూలు ధరించరాదు అన్న అంశం ఎవరు పాటిస్తున్నారు?
నిబంధన పెట్టినవారే దాన్ని నిక్కచ్చిగా అమలు జరిపించాలి. బోర్డుపెట్టి ఊరుకుంటే ఇలాగే ఉంటుంది.

మామెడ రాజేంద్రప్రసాద్, వౌలాలి, హైదరాబాద్
వెస్టిండీస్ జట్టుతో ఇటీవలే మన జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉంది. రెండో టెస్ట్ కూడా పూర్తి అయింది. కానీ రెండు టెస్టులు జరిగినప్పుడు కూడా స్టేడియంలలో ఎవరూ ప్రేక్షకులు లేరు. టెస్టు క్రికెట్‌కు ఆదరణ పూర్తిగా తగ్గిందనడానికి ఇదే ఉదాహరణ. మరి అలాంటప్పుడు ఎందుకు ఆడుతున్నారు?
ఆడించే వారికే తెలియాలి.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
హైదరాబాద్ బహిరంగసభలో టిఆర్‌ఎస్‌ను, సిఎం గార్ని పొగడటం, యుపిఏని తిట్టడమే సరిపోయింది మోదీగార్కి. ఎ.పి.కి హామీ ప్రకటన అక్కడ చేస్తే ఎంత బాగుండేదో? కారణం అక్కడే ఎ.పి. పెద్దలుండేది? అది నా అత్యాశే అంటారా?
నో డౌట్!

డొక్కా శంకర్, వక్కలంక
మనలో మనం ఈ ఆదివారం కనిపించకపోవటం బాధ కలిగించింది. కారణం?
ప్రశ్నలు లేక.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com