S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణవేణీ తరంగిణి (మాతో-మీరు)

కృష్ణా పుష్కరాల సందర్భంగా అందించిన ‘పుష్కర రాగిణి.. కృష్ణవేణీ తరంగిణి’ కవర్‌స్టోరీ మా ఇంటిల్లిపాదినీ అలరించింది. పుష్కరుడి ప్రవేశం.. ఆయా పుణ్యక్షేత్రాల సందర్శన తదితర అంశాలతో క్లుప్తంగా అందించినందుకు కృతజ్ఞతలు. అలాగే సండే గీత, ఓ చిన్న మాట, అవీ-ఇవీ, ‘్భ..’ కథ చాలాచాలా బాగున్నాయి.
-కాళహస్తి వెంకట శేషగిరిరావు (నెల్లూరు)
లోకాభిరామమ్
గోపాలంగారి ‘లోకాభిరామమ్’ మమ్మల్ని ఎంతగానో అలరిస్తోంది. ‘ఇది కథేనా’ కథ నిజ జీవితంలోంచి వచ్చినదా కాదా అనే విషయాన్ని ఆలోచించకూడదని, ఆయమ్మగారి 5వ అంతస్తులో తులసమ్మకు సంరక్షణగా నీళ్లు పోయడం లాంటి విశేషాలు చక్కగా తెలిపారు.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
లక్ష్యం
సండే గీత ‘లక్ష్యం’ అన్ని వయసుల వారికి వర్తించేదయినా ముఖ్యంగా విద్యార్థులు తాము లక్ష్యంగా పెట్టుకున్న చదువు మీద ఇష్టపడి శ్రద్ధతో చదివి విజయం సాధించాలి. ఆ చెట్టు మీద పక్షి కన్నును గురిచేసి బాణం వదలమంటే మొత్తం చెట్టంతా కనపడుతోందన్నారు. కాని అర్జునుడు మాత్రం గురి చూసిన పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోందన్నాడు. అందుకే అర్జునుడు అందరికంటే గొప్ప విలువిద్యగాడయ్యాడు. చదువు మీద విద్యార్థుల గురి అలా ఉండాలి. దానికితోడు అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇది ఓ చిన్న మాటలో చెప్పబడింది. ‘వెల్‌కమ్ టు డెత్’ అంటూ ఏ మాత్రం భయపడక భగత్‌సింగ్ ఉరితాడును పూలహారంగా భావించాడు. స్ఫూర్తి కథను అందరూ చదవాలి.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
పిచ్చెక్కిస్తున్న ఆట
ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తూ అధికారులకు తలనొప్పిగా మారిన పోకెమాన్ గో గేమ్ విశేషాలు సవివరంగా తెలిపినందుకు ధన్యవాదాలు. పోకెమాన్ గో గేమ్ సృష్టికర్త, ఆ గేమ్ ఆడే విధానం, అందులోని లెవల్స్ గురించి, అది శరవేగంగా వ్యాప్తి చెందిన విధానాన్ని తెలుసుకున్నాం. తలలు వంచి, ప్రపంచాన్ని మరచిపోయి ఈ గేమ్‌లో లీనమై అనేకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. డ్రైవింగ్ చేస్తూ ఈ గేమ్‌ను ఆడేవారి వల్ల వారికే కాదు, వారివల్ల ఇతరులకూ ప్రాణాపాయమే. ఈ గేమ్ మన దేశానికీ వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా మారబోతున్నాయో తలచుకుంటేనే భయం వేస్తోంది. తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలను, యువతను ఈ మత్తులోకి దిగకుండా కాపాడుకోవాలి.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
ఊరి పేరు
గోపాలంగారు చెప్పినట్టు ఊరు పేరు ఆంగ్లంలో ఒక విధంగా రాస్తే తెలుగులో మరో విధంగా ఉచ్ఛారణ ఉంటుంది. దశాబ్దాల క్రితం వాయిస్ ఆఫ్ అమెరికా రేడియో వార్తల్లో పంజాబ్, కడప, కర్నూలు బదులుగా పుంజాబ్, కుడ్డప్పా, కుర్నూల్ అని చదవడం విన్నాను. ఎలమంచిలి పేరు రైల్వేవారి భాషలో ఇప్పటికీ యెల్లమంచిలి అనే ఉంది. వధూవరుల కోసం చైనాలో జరిగే సంత సంగతులు వింతగా అనిపించినా పరిచయ వేదిక పేరిట ఇప్పుడు వధూవరుల వేట సాగుతూనే ఉంది. ఏం చేస్తాం! కాలాన్నిబట్టి అవసరాలకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా.
-ఆర్.మరుదకాశి (కరప)
పుష్కర రాగిణి
ఈ వారం కవర్‌స్టోరీ ‘పుష్కర రాగిణి.. కృష్ణవేణీ తరంగిణి’ వ్యాసం విశేషంగా ఆకర్షించి పుష్కరాల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు గుదిగుచ్చి చెప్పడం బావుంది. అందరూ విజయవాడకు వెళ్లే బదులు నదీ పరీవాహక ప్రదేశాల్లోని ఇతర పుణ్యస్థలాల్లో స్నానం చేయడం మేలు. రాజమండ్రి తొడ తొక్కిడి దుర్ఘటన జ్ఞాపకం ఉంది కదా! ‘మిలియన్‌లో పదో భాగం’ క్రైం కథ ఆసక్తి రేకెత్తించి ‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే..’ పాట జ్ఞప్తికి తెచ్చింది. ‘అవీఇవీ’లో రోబో స్పైడర్, మెలికలు తిరిగే శరీరం అంశాలు అలరించాయి.
-బి.చంద్రిక (రాజేంద్రనగర్)
పూజ ఎందుకు?
ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కూడా గుడికి వెళ్లి పూజ ఎందుకు చెయ్యాలో చెప్తూ ధ్వని తరంగాల కానె్సప్ట్ వివరణ కొత్తగా అనిపించింది. అన్యాపదేశంగా వైద్యాలయం కూడా దేవాలయం లాంటిదే అనడమూ చక్కగా ఉంది. కామవాంఛను నిరోధిస్తే గృహహింస పెరిగి అనేక సమస్యలొస్తాయి అనడం అక్షరాలా సత్యమే. అక్షరాలోచనాల్లో ‘తెల్లారని మనసు’ అంటూ మరీ నైరాశ్యంతో వాపోవడం కన్నా ఉన్న కాస్తంత మంచిని ఆశావహ దృక్పథంతో చూడటం మంచిది. రేపన్నది లేదని తెలిసినా ఆ పువ్వులెంతగా నవ్వుతాయో చూడు అన్న నానీలోని ఆశావహ దృక్పథం బావుంది.
-కె.సుభాష్ (శ్రీనగర్)

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.