S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జంబో బస్సు

ఈ వారం స్పెషల్ శీర్షికన అందించిన ‘జంబో బస్సు వస్తోంది’ కవర్‌స్టోరీ చాలా బాగుంది. మినీ ట్రైన్స్‌ని తలపించేలా ఉన్న బస్సు చూస్తుంటే ఆసక్తిదాయకంగా ఉంది. ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం. లక్ష్మిగారు రాసిన చిన్నిచిన్ని ఆశ కథ నేటి తరం విద్యార్థుల ఇబ్బందులను వివరించింది. యాంత్రిక జీవనంలో చదువుతోపాటు ఆటలు కూడా అవసరం అని పేరెంట్స్ గుర్తించాలి. తేలే పోస్ట్ఫాస్ నిజంగా నమ్మలేకపోయేలా ఉంది. కానీ అది చదివాక నమ్మక తప్పదుగా మరి. మొత్తానికి ఈ వారం సండే మేగజైన్ ఆసక్తిదాయకంగా ఉంది.
-శ్రీరామ్ సబ్బిశెట్టి (వేములపాలెం, తూ.గో.జిల్లా)
దేవుడిచ్చిన కానుక
‘ప్రతిరోజు’ అనేది మనకు దేవుడిచ్చిన కానుకగా భావించి భద్రపరచుకొని, మన జీవితంలో అదొక జ్ఞాపకంగా మిగిలేలా సద్వినియోగపరచుకోవడం అనే ‘సండే గీత’ చాలా ప్రత్యేకంగా ఉంది. ‘ఓ చిన్న మాట’లో అనారోగ్యంగా ఉన్న మిత్రులని, బంధువులని తరచూ కలవడం అనే ‘జింబో’గారి మాట చాలా ఆచరణాత్మకం. అనారోగ్యంగా ఉన్నవారు, బైట తిరుగాడలేని వారు తమను ఎవరైనా వచ్చి పలకరిస్తారేమోనని ఎదురుచూస్తూంటారు. అలాంటప్పుడు వారిని కలిసి ఉత్సాహపరిచే కబుర్లు చెప్పి, గత జ్ఞాపకాలు పంచుకుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందనేది వాస్తవం. ‘గోపాలం’గారి లోకాభిరామమ్ శీర్షిక చాలా బాగుంటోంది. ‘అవీ-ఇవీ’లో కబుర్లు సరదాగా ఉంటున్నాయి. పిల్లల చిన్నిచిన్ని ఆశల్ని చిదిమేయడాన్ని ఈ వారం కథ అద్దం పట్టింది. వెరసి పత్రికలోని అన్ని అంశాలు చాలా బాగున్నాయి.
-యం.కె.గిరిజామణి (వనస్థలిపురం)
పరామర్శ
అనారోగ్యంతో ఉన్నవారిని కలిసి పరామర్శించి త్వరలో స్వస్థత చేకూరుతుందని, ఇలాంటి వారే గతంలో చాలామంది ఆరోగ్యవంతులయ్యారని ఓ నాలుగు మంచి మాటలు మాట్లాడితే రోగికి మందులకన్నా ఈ మాటలే మంచి మంత్రంలా పని చేస్తాయి. ఇలాంటి జబ్బు చేసినవారు చనిపోయారనే విషయాలు అస్సలు ప్రస్తావించకూడదనే నియమాన్ని పాటించాలి. అలాగే కావలసినవారు, తెలిసినవారు, బంధువులు మరణిస్తే వెంటనే వారింటికి వెళ్లాలి. పెళ్లికి ఆహ్వానం రాకపోతే వెళ్లకూడదు. కానీ ఆహ్వానం లాంటిదేమీ రాకపోయినా విషాద సమయాలలో ఆదుకోవాలి. ఓ చిన్న మాట ‘కాంక్ష’ ధైర్య వచనాలను చెప్పింది. ఇక టెర్రకోట జ్ఞాపకాలు, లోకాభిరామమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. గాంధీ - ఇర్విన్ ఒప్పందంలోని అనేక అంశాలను తేటతెల్లం చేసింది ‘్భగత్‌సింగ్’ సీరియల్.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
వెలితి
ఈ వారం ఆదివారం అనుబంధంలో ‘మనలో మనం’ శీర్షిక లేకపోవడం చాలా వెలితిగా అనిపించింది. శాస్ర్తీగారి బుల్లెట్‌ల్లాంటి సమాధానాలను మిస్సయ్యాం. ‘వినదగు’ శీర్షికలో ఆత్మయోగంలో అతిగుహ్యమైన ఆత్మజ్ఞానాన్ని సరళమైన విశే్లషణతో అందించిన వైనం చాలా బాగుంది. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించేందుకు భౌతిక దైహిక కర్మలను దాటి భౌతిక ఫలాసక్తి లేకుండా ఆధిభౌతిక నిష్కామ కర్మలను చేస్తూ సత్వగుణ సంపన్నులమై లభించేదంతా భగవంతుని ప్రసాదమన్న విచక్షణతో తృప్తిగా జీవించాలన్న సందేశం ఆచరణీయంగా ఉంది.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
పేపర్ లీక్
మన పిల్లలు డాక్టర్, ఇంజనీర్, ఐఎఎస్ - ఇలా ఏది కావాలో నిర్ణయించుకొని దాని కోసం ఏకాగ్రంగా కృషి చేయాలని ‘సండే గీత’లో చెప్పడం బాగుంది. అయితే కొందరు స్వార్థపరులు డబ్బు వెదజల్లి పేపర్ లీక్ చేసి అమాయకులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాసే పరిస్థితి కల్పిస్తూ క్షోభ పెడుతున్నారు. పేపర్ లీకేజిని అరికట్టినప్పుడే మెరిట్ స్టూడెంట్స్‌కి న్యాయం జరుగుతుంది. పళ్లేల మీద గరిటలతో కొట్టి నిరాహారదీక్షకు సంఘీభావం తెలపడం ఏడ్చినట్టుందని నిర్మొగమాటంగా మీరు చెప్పడం భలే బావుంది.
-కె.గునే్నశ్ (కొవ్వాడ, తూ.గో.జిల్లా)
జీవిత పయనం
మన మీద మనకు నమ్మకం ఉండాలి. భగవంతుని మీదా ఉండాలి. వాహన ప్రయాణమే కాదు జీవితపయనం కూడా ఇలాంటిదే. దేనికీ పూచీ ఉండదు అన్నది ఓ చిన్నమాట కాదు. బహుదొడ్డ సత్యం. మనం ప్రపంచానికి ఏం చెప్పాలన్నా మాటలతోనే చెప్తాము. చాలాకాలం తర్వాతే అక్షరాల ద్వారా చెప్పడం జరిగింది. మాటలు, పాటలు తరతరాలుగా వ్యాప్తి చెందినపుడు వినికిడి లోపం, అజ్ఞానం వల్ల మాటలు అపభ్రంశం చెందాయి.
-జె.్ధర్మతేజ (గొడారిగుంట, తూ.గో.జిల్లా)

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.