S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గాంధీ ఆడిన నాటకం-1 (భగత్‌సింగ్- 44)

Sir Herbert Emerson, the Home Member who was called upon to play a prominent role in Delhi negotitions records listening with amazement to Irwin and Gandhi after agreement had been reached by them that Bhagat Singh must be executed, engaged in a prolonged discussion not as between two statesmen but as between two saints on the sanctity of human life.
[Viscount Halifax: A Biography,
Allan Campbell Johnson, p.316]
[Quoted in Gandhi And Bhagat Singh, V.N.Dalta, p.5]

భగత్‌సింగ్‌ను ఉఠి తీయాల్సింథేనన్న అంగీకారానికి వచ్చాక ఇర్విన్, గాంధీలు సుదీర్ఘమైన చర్చ చేశారు. ఇద్దరు రాజకీయవేత్తల్లా కాక.. ఇద్దరు సాధు పుంగవుల్లా వారు మానవ జీవిత పవిత్రత గురించి చర్చ చేస్తుంటే తాను విస్తుపోయి విన్నట్టు ఢిల్లీ చర్చల్లో ప్రముఖ పాత్ర వహించిన హోం మెంబరు సర్ హెర్బర్ట్ ఎమర్సన్ రాశాడు.
వైస్రాయ్ ఇర్విన్ (అనంతర కాలంలో ఆయన వైకౌంట్ హాలిఫాక్స్‌గా బిరుదాంకితుడయ్యాడు) జీవిత చరిత్రలో గ్రంథకర్త అల్లాన్ కాంప్‌బెల్ జాన్సన్ బయటపెట్టిన విషయమిది.
దీన్నిబట్టి ఏమి తెలుస్తుంది? భగత్‌సింగ్‌ని ఉరి తీయాల్సిందేనని ఢిల్లీ చర్చల్లో వైస్రాయ్ ఇర్విన్, గాంధీజీల మధ్య అంగీకారం కుదిరింది. నిండా పాతికేళ్లు లేని ఒక మహా దేశభక్తుడికి ఉరివేసి ఉసురు తీయాలన్న లోకోత్తర నిర్ణయం చేశాక ఆ ఇద్దరు మహాత్ములూ మానవ జీవిత పవిత్రత గురించి మహా సాధుపుంగవుల్లా సిద్ధాంత చర్చ చెయ్యటం ఏడ్చినట్టే ఉంది.
ఢిల్లీ చర్చలు 1931 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 5 వరకూ జరిగాయి. ఆ మధ్యకాలంలో మొత్తం 8సార్లు భేటీ వేసినా భగత్‌సింగ్ ఉరిశిక్ష విషయాన్ని వైస్రాయ్‌తో మహాత్ముడు ప్రస్తావించింది (వారు చెప్పిన ప్రకారమే) ఒకే ఒకసారి: ఫిబ్రవరి 18న. అదీ చర్చనీయాంశాలన్నీ అయిపోయాక ఆఖరులో యథాలాపంగా. ఆ సమయాన అక్కడే ఉన్న హోం మెంబరు సర్ హెర్బర్ట్ ఎమర్సన్ వెల్లడించినట్టుగా ఇంకో బ్రిటిషు ఉన్నతాధికారి అల్లాన్ కాంప్‌బెల్ జాన్సన్ గ్రంథస్థం చేసిన దాని ప్రకారం భగత్‌సింగును ఉరి తీయాల్సిందేనని అంగీకారం కుదిరిందీ అంటే అది 1931 ఫిబ్రవరి 18నే అయి ఉండాలి.
గమనించాల్సింది ఏమిటంటే - భగత్‌సింగునూ, అతడి ఇద్దరు సహచరులనూ ఉరి తీయడానికి వైస్రాయ్‌కి ఫిబ్రవరి 18నే అంగీకారం తెలిపిన మహాత్ముడే - 17 రోజుల తరవాత మార్చి 7న ఢిల్లీ సభలో తనను నిలదీసిన జనానికి ‘వారికి ఏమీ కాదు. ముందు శాంతి ఒప్పందాన్ని అమలు కానిచ్చి, ఆరు నెలల తరవాత నా దగ్గరికి రండి. అప్పటికి వారు క్షేమంగా ఉంటారు. ఉరి తప్పడమే కాదు; జైలు నుంచి విడుదల కూడా అవుతారు’ అని మాయమాటలు చెప్పాడు.
"If God willing, Bhagat Singh and others are alive when we have arrived at the proper stage, they would not only be saved from gallows, but released... accept the settlement and then come and ask me about Bhagat Singh. Come to me six months hence, after you have implemented the settlement and ask me the question you are asking me today and I promise to satisfy you."
[Collected Works of Mahatma Gandhi, (gandhiserve.org) Vol.51, Page 229, 230]

మరి కొథ్ది రోజుల్లో భగత్‌సింగ్‌ను ఉరి తీయడానికి వైస్రాయ్‌కి అంగీకారం తెలిపిన మహానుభావుడే బయటికి వచ్చాక ‘ఆరు నెలల తరవాత కూడా భగత్‌సింగ్ క్షేమంగా ఉంటాడు. బయటికి వస్తాడు’ అని జనాన్ని మభ్యపెట్టటం మోసం కాక మరేమిటి?
ఇక్కడో అనుమానం రావచ్చు. కొనే్నళ్ల తరవాత ఇర్విన్ జీవిత చరిత్రలో ఎవరో రాసింది పట్టుకుని మన మహాత్మాజీ నిజాయతీని శంకించడం సబబా? అలా రహస్య అంగీకారం కుదిరిందని ఇర్విన్ చెప్పాడా?
లేదు.
1931 ఫిబ్రవరి 18న గాంధీతో జరిగిన మంతనాల గురించి వైస్రాయ్ ఇర్విన్ ఆ రోజునే లండన్‌లోని విదేశాంగ మంత్రికి పెద్ద నివేదిక పంపాడు. అందులో భగత్‌సింగ్ త్రయం ఉరి గురించి పేర్కొన్నది ఇది:

‘చివరిలో, పై వాటితో సంబంధం లేకుండా భగత్‌సింగ్ కేసును గాంధి ప్రస్తావించాడు. శిక్షను మార్చమనేమీ ఆయన కోరలేదు. ఏ ప్రాణాన్నయినా తీయడానికి తాను వ్యతిరేకం కనుక (నా స్థానంలో తానుంటే) తాను అలా చేస్తాననయితే చెప్పాడు. శిక్ష మార్పు చేస్తే శాంతి మీద దాని ప్రభావం ఉండగలదని ఆయన అన్నాడు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కోరింది ఉరిశిక్ష వాయిదాను. శిక్ష అమలు తేదీల గురించి నిర్ణయం ఏమైనప్పటికీ... ఈ సందర్భంలో శిక్ష తగ్గింపు (commutation) కోరుతూ చేసే వాదన ఏదైనా అంతే తీవ్రతతో మరే హింసాత్మక నేరానికీ వర్తింపజేయవచ్చు. శిక్ష మార్పుకు సంబంధించి వైస్రాయ్‌కి గల అధికారాలకు అందరూ ఎరిగిన దయానియమాలు ఉన్నాయి. రాజకీయ కారణాలతో వాటిని ఆవాహన చేయటం కుదరదు - అని నేనన్నాను.
(సం.) ఇర్విన్
అదే గ్రంథం, అదే సంపుటి, , gandhiserve.org/ cwmg/
Vol.51, Page 151]
ఇథే భేటీ గురించి గాంధీజీ చెప్పిందిది:
‘నేను భగత్‌సింగ్ గురించి మాట్లాడాను. ‘మన చర్చతో దీనికి సంబంధం లేదు. దాన్ని నేను ప్రస్తావించటం అనుచితమేమో కూడా. కాని ప్రస్తుత వాతావరణం ఇంకా అనుకూలంగా మారాలని మీరు అనుకుంటే భగత్‌సింగ్ మరణశిక్షను సస్పెండ్ చేయాలి’. వైస్రాయికి ఇది బాగా నచ్చింది. ‘ఈ విషయాన్ని ఈ విధంగా నా ముందు ఉంచినందుకు మీకు కృతజ్ఞుడిని. శిక్షను మార్చటం (commutation) కష్టం. కాని సస్పెన్షను కచ్చితంగా పరిశీలించదగ్గదే’ అన్నాడాయన.
‘భగత్‌సింగ్ గురించి నేను ఇలా చెప్పాను: అతడు నిస్సందేహంగా ధైర్యశాలి. కాని అతడి ఆలోచనా విధానం సరిగా లేదు. కాని మరణశిక్షలో దోషమేమిటంటే అలాంటి వాడికి తనను తాను సంస్కరించుకునేందుకు అది అవకాశం ఇవ్వదు. మానవత్వానికి సంబంధించిన అంశంగానే నేను ఈ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. దేశంలో అనవసరపు కల్లోలం లేకుండా చేయటానికి సస్పెన్షనును కోరుతున్నాను. నాకే అధికారం ఉంటే అతణ్ని విడుదల చేస్తాను. కాని ప్రభుత్వం అలా చేస్తుందని నేను ఆశించలేను. ఈ అంశంపై మీరు సమాధానం ఇవ్వకపోయినా నేను ఏమీ అనుకోను.’
అదే గ్రంథం, అదే సంపుటి, పే.155

నాటి సంభాషణ గురించి ఇర్విన్, గాంథీల కథనాలలోని సమానాంశం ఏమిటంటే భగత్‌సింగుకు విధించిన ఉరిశిక్షను మార్చాలని మహాత్ముడు కోరనే లేదు. ఆయన అడిగిందల్లా శిక్షను వాయిదా వేయాలని మాత్రమే. హోం మెంబరు ఎమర్సన్ బయటపెట్టినట్టు భగత్‌సింగ్‌ను ఉరి తీయనివ్వాలన్న అంగీకారం ఆ రోజున కుదిరినా, ఆ సంగతి ఇద్దరు పెద్దల్లో ఎవరూ సహజంగానే పైకి చెప్పరు. వారు చెప్పనంత మాత్రాన అలాంటి లోపాయకారి అంగీకారం గాంధి, ఇర్విన్‌ల మధ్య కుదిరిందా లేదా అని సంశయించాల్సిన పనిలేదు. ఎందుకంటే గాంధీగారికి అత్యంత ఆప్తుడు, ఆంతరంగికుడు అయిన భోగరాజు పట్ట్భా సీతారామయ్య 1934లో తాను రచించిన కాంగ్రెస్ ఆధికారిక చరిత్రలో ఈ నమ్మలేని నిజాన్ని ధ్రువీకరించాడు ఇలా:

Lord Irvin... undertook to secure a postponement of the execution till after the Karachi Congress... but Gandhi himself definitely stated to the Viceroy that if the boys should be hanged, they had better be hanged before the Congres, than after... The agreement was signed on the 5th March, 1931.
[The History of the Indian National Congress, B.P.Sitaramayya, p.745]

(కరాచీ కాంగ్రెసు ముగిసేంతవరకూ ఉరిశిక్షలను తాను వాయిథా వేయిస్తానని లార్డ్ ఇర్విన్ ముందుకొచ్చాడు... కాని, ఆ కుర్రాళ్లను ఉరి తీయాల్సిందే అనుకున్నప్పుడు కాంగ్రెసు మహాసభల తరవాత కాదు, వాటికి ముందే వారిని ఉరితీయడం మంచిదని గాంధీయే స్పష్టంగా చెప్పాడు.... 1931 మార్చి 5న ఒప్పందం మీద సంతకాలు అయ్యాయి.)

కాంగ్రెసు చరిత్రకారుడి మాటలనుబట్టే తెలుస్తున్నది కదా- మార్చి 5న ఒప్పందం కుదరడానికి ముందే - అంటే ఫిబ్రవరి 18 మంతనాలలోనే భగత్‌సింగ్ త్రయాన్ని కరాచీ కాంగ్రెసు సభల కంటే ముందు - అంటే 1931 మార్చి 29లోపే ఉరితీయడానికి మహాత్ముల వారు స్వయానా సమ్మతించారని! కాంగ్రెసు సభలు అయ్యేంతవరకూ వాయిదా వేయిస్తానని వైస్రాయే ముందుకొచ్చినా - అక్కర్లేదు. తీయాల్సిందే అనుకుంటే ఆ సభలకు ముందే వారిని ఉరి తీసెయ్యమని సాక్షాత్తూ బాపూజీయే సలహా ఇచ్చాడని!
మళ్లీ ఈ పుణ్యాత్ముడే బయటికి వెళ్లాక, భగత్‌సింగ్ ఉరిని ఆపించడానికి, కనీసం వాయిదా వేయించడానికి తాను వైస్రాయ్ మీద గట్టి ఒత్తిడి తెచ్చాననీ, దాని కోసం తన శాయశక్తులా పాటుపడుతున్నానని, తాను కుదుర్చుకున్న దిక్కుమాలిన ఒప్పందం అమలయ్యేంతవరకూ, ఎన్ని నెలలైనా వారు బతికే ఉంటారని - జనానికి నమ్మకంగా భరోసా ఇచ్చాడు.
భగత్‌సింగ్ గురించి గాంధి, ఇర్విన్‌లు మళ్లీ మాట్లాడుకున్నది ఒప్పందం కుదిరిన రెండు వారాల తరవాత. మార్చి 19న. అప్పుడు ఏమైందన్న దాని గురించి గాంధిగారు ఎక్కడా రికార్డు చేసినట్టు లేదు. ఇర్విన్ అదే రోజు లండన్‌కి పంపిన రిపోర్టు ఇది:

‘అన్ని విషయాలు మాట్లాడాక బయలుదేరబోతూండగా భగత్‌సింగు కేసును గాంధి ప్రస్తావించాడు. మార్చి 24న అతడిని ఉరితీయబోతున్నట్టు పత్రికల్లో చూశాను; అది దురదృష్టకరమైన రోజు; ఎందుకంటే కాంగ్రెసు కొత్త అధ్యక్షుడు కరాచీలో అడుగుపెట్టేది ఆ రోజునే; ఆనాడే ఉరి తీస్తే ప్రజల్లో పెద్ద గగ్గోలు లేస్తుంది - అన్నాడాయన.
‘ఈ కేసును నేను చాలా జాగ్రత్తగా పరిశీలించాను. కాని శిక్షను మార్చడానికి నా అంతరాత్మను సంతృప్తిపరచగల హేతువేదీ నాకు కనిపించలేదు. ఇక తేదీ గురించీ. కరాచీ కాంగ్రెసు మహాసభ ముగిసేంతవరకూ వాయిదా వేసే సంభావ్యతనూ నేను ఆలోచించాను. బుద్ధిపూర్వకంగానే దాన్ని తిరస్కరించాను. దానికి కారణాలేమిటంటే-
‘1.ఉత్తర్వులు జారీ అయ్యాక రాజకీయ కారణాలతో ఉరి అమలును వాయిదా వేయడం సరికాదని నాకు తోచింది. 2.వాయిదా వేస్తే నేను శిక్ష మార్చే విషయం పరిశీలిస్తున్నానన్న అభిప్రాయం బంధుమిత్రులకు కలుగుతుంది కాబట్టి వాయిదా అమానుషం. 3.సభలు అయ్యాక ఉరి తీస్తే ప్రభుత్వం తమను మభ్యపెట్టిందని కాంగ్రెసు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
‘నా వాదనలోని బలాన్ని గాంధీ అర్థం చేసుకున్నట్టే కనిపించాడు. ఇక అతడు ఏమీ మాట్లాడలేదు.’
సం.ఇర్విన్
అదే గ్రంథం, అదే సంపుటి, పే.272

చూశారా? గాంథీగారు ఇర్విన్‌తో మాట్లాడాల్సినవన్నీ మాట్లాడుకున్నాక, బయలుదేరబోతూ చిట్టచివరి అంశంగా భగత్‌సింగ్ కేసును ప్రస్తావించాడు. అప్పుడు కూడా ఉరి ఆపమని కోరలేదు. ఆయన బెంగల్లా ఉరికి ముహూర్తం ఏరికోరి 24వ తేదిన పెట్టారేమిటి? అది కాంగ్రెసు కొత్త అధ్యక్షుడు మహాసభల నిమిత్తం కరాచీలో అడుగుపెట్టే రోజు కదా? అదే రోజున వీళ్లను ఉరితీస్తే జనంలో గగ్గోలు పుడుతుందేమో - అని! అంతకు ముందు ఫిబ్రవరి 18నే వైస్రాయికి తాను సలహా ఇచ్చినట్టు కరాచీ సభల కంటే ముందు మార్చి 24 కాకుండా మరే రోజైనా వాళ్లను ఉరితీస్తే మహాత్మాజీకి అభ్యంతరం లేదన్నమాట. అందుకే కరాచీ మహాసభలు ముగిసేంతవరకూ ఆ ముగ్గురి ఉరిని వాయిదా వేయటం కుదరదని ఇర్విన్ ప్రభువు కారణాలను ఏకరవు పెడితే గాంధిగారు కిమ్మనలేదు.
పోనీ - ఇంగ్లిషు వాడు చెప్పిందే పరమ సత్యమని ఎలా నమ్మగలం? లండన్‌కి పంపిన రిపోర్టులో అతడు రాయనంత మాత్రాన, ఆ రోజు మహాత్ముడు భగత్‌సింగ్ ఉరిని సస్పెండు చేయమని వైస్రాయ్‌ని గట్టిగా కోరలేదని, వారి ప్రాణాలు కాపాడటానికి శాయశక్తులా ఒత్తిడి పెట్టలేదని, ఎలాంటి హామీని సూచనప్రాయంగానైనా రాబట్టలేదని ఎలా నిర్ణయించగలం?
సందేహం కరెక్టే. కాని ఆ రోజున వైస్రాయ్‌తో మాట్లాడి బయటికి రాగానే గాంధీజీ ఇంకొకరిని కలిశాడు. ఆయన హోం సెక్రటరీ సర్ హెర్బర్ట్ ఎమర్సన్. నిజానికి ఆ రోజు గాంధీగారు అక్కడికి వెళ్లింది ముఖ్యంగా ఎమర్సన్‌ని కలిసి, అన్ని అంశాలూ వివరంగా చర్చించడానికే. వైస్రాయ్‌ని దర్శించింది కేవలం మర్యాద కోసమే. ఎమర్సన్‌తో సంభాషణలోనూ భగత్‌సింగ్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు గాంధి ఏమన్నాడో, ఏదైనా హామీని రాబట్టాడో, తానే హామీని ఇచ్చాడో ఎమర్సన్ తన రిపోర్టు చెబుతుంది. నాడు లండన్‌కి హోం మెంబరు పంపిన రిపోర్టు కోసం ఎక్కడో వెదకనక్కర్లేదు. స్వతంత్ర భారతంలో కాంగ్రెసు కేంద్ర ప్రభుత్వం సంకలింపజేసిన మహాత్మాగాంధి కలెక్టడ్ వర్క్స్ (gandhiserve.org) 51వ సంఫుటి చివర 453-460 పేజీల్లో చేర్చిన అనుబంధంలో ఆ సీక్రెటు రిపోర్టును చూడొచ్చు.
అందులో ఏముందో వచ్చేవారం. *

ఎం.వి.ఆర్.శాస్ర్తి