S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తపన (మాతో-మీరు)

‘చివరి చీర’ కథలో నాన్న పాత్ర తపనకు తగినట్టుంది. కథా కథనం చాలా చక్కగా ఉన్నాయి. పల్లీకరణ అంటూ కొత్త పదాన్ని పలికించారు. పండుగలు కాలక్రమంలో ఎలా రూపాంతరం చెందుతాయో మనవలు మనవరాళ్ల నోటి నుండి పలికించారు. రచయితకు ధన్యవాదాలు.
-పెండికట్ల పాపారావు (అమలాపురం)

పిచ్చి!!
సెల్ఫీ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లెందరో! ఇప్పుడో పోకెమాన్ పిచ్చి! ప్రమోదం పేరుతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పోకెమాన్ వల్ల దేశ భద్రతకు ముప్పు కూడా. కొన్ని దేశాల్లో బహిష్కరించారు. మనమూ జాగ్రత్త పడకపోతే.. సెల్ఫీ పిచ్చిలానే ఇది మన యువతను చుట్టుముట్టే ప్రమాదం ఉంది. క్రైం కథలు వస్తు వైవిధ్యంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం కథ ‘సాహసికుడు’ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి పాముని ఉపయోగించుకొని వెచ్చదనానే్న పాములు గుర్తిస్తాయన్న పాయింట్‌తో డ్రై ఐస్ ట్రిక్ ప్రయోగించి గెలవడం కొత్త కానె్సప్ట్. బాగుంది.
-పి.చంపక్ (మాధవనగర్)

లక్ష్యం
జీవితంలో ఒక లక్ష్యం నిర్దేశించుకొని, ఆ లక్ష్య సాధన కోసం కాలం, శ్రమలను కేంద్రీకరిస్తూ, నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలన్న విలువైన దిశా నిర్దేశం చేసిన ‘సండే గీత’ బాగుంది. స్ఫూర్తి కథ స్ఫూర్తిదాయకంగా ఉంది. లాహోర్ కుట్ర కేసులో నిందితులకు శిక్ష ముందుగానే ఖరారు చేసుకొని, దానిని రుజువు చేసేందుకు బూటకపు సాక్ష్యాధారాలు సేకరించి తెల్లదొరతనం న్యాయానికి నిలువునా సమాధి కట్టిన వైనాన్ని ఈ వారం ‘్భగత్‌సింగ్’లో అద్భుతంగా వివరించారు. తీర్పు విన్నాక కూడా తమ జీవితాలు దేశమాతకు అర్పణం కాబోతున్నాయన్న సంతోష వైఖరితో భగత్ సింగ్ ఉండటం మాకెంతో ప్రేరణ కలిగించింది. దేశభక్తుల పట్టికలో భగత్‌సింగ్‌కు నిస్సందేహంగా అగ్రతాంబూలం లభించాలన్నది నిర్వివాదాంశం.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)

భేష్
బహుమతి చూడగానే చిన్నపిల్లాడిలా మారిపోయి పరవశించవచ్చు అని చెప్పిన ‘సండే గీత’ భేషుగ్గా ఉంది. అయితే బహుమతుల వల్ల చిన్నచిన్న సమస్యలూ ఉన్నాయి. మూడు చేతిగడియాలా బహుమతిగా వస్తే రోజుకొకటి వాడుతూ ఇబ్బంది పడాలి. రిటైరయ్యే రోజు వచ్చే బహుమతులు మరీ ఇరకాటంలో పెట్టేస్తాయి. సాధారణంగా భగవద్గీత పుస్తకాలు, గీతను బోధించే కృష్ణుని పటాలు, శాలువాలు కుప్పలుగా వచ్చి పడతాయి. వాటిని ఉంచుకోలేము. ఎవరికీ ఇచ్చివేయనూ లేము. ‘అవీ-ఇవీ’లో కురుల సుందరి, నోరూరించే మ్యూజియం, ట్రంప్ లాగ కనిపించే చెట్టు ఆకట్టుకున్నాయి.
-ఎన్.గిరిధర్ (కాకినాడ)

ఇంతే సంగతులు!
జంబో బస్‌కి సంబంధించిన విశేషాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్ని వైభోగాలున్నా ఎంతటి బస్ అయినా రోడ్డు సరిగా లేకపోతే ఇంతే సంగతులు! మన రోడ్ల మీద అస్సలు పనికిరావు. ఇక- వివాహం అయిన తర్వాత నటించడానికి అమలాపాల్ భర్త ఒప్పుకోకపోవడం వల్లనే వాళ్లు విడిపోయారు. అందుకు వారే బాధపడటం లేదు. మనకేల బాధ?!
-బి.ప్రభాస్ (గాంధీనగర్, తూ.గో.జిల్లా)

ఉత్కంఠ
క్రైం కథలో పోలీస్ చీఫ్ పాల్ అనుమానంతో హారిస్‌ను అరెస్ట్ చేయడం, పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో అతనికి ముప్పై ఏళ్ల శిక్ష పడటం, అది అన్యాయం అని బాధపడిన పాల్ తను బాధ్యత వహించి సొంత ఖర్చుతో వ్యక్తిగతంగా పరిశోధించి హారిస్ నిర్దోషి అని నిరూపించడం, విడుదల అయిన హారిస్ హత్యకుగురి కావడం ఈసారి కూడా పాల్ పరిశోధించి హంతకుని పట్టుకోవడం ఉత్కంఠభరితంగా సాగింది. ప్రేమలేఖలే కదా, పీజాలు, గొర్రెల్ని కూడా బట్వాడా చేసే పోస్ట్ఫాస్, అదీ నీటిపై తేలియాడుతూ ఉందంటే నమ్మలేని నిజమే.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)

ప్రమాదం?!
కవర్‌స్టోరీ ‘ప్రమోదంలో ప్రమాదం’ ఆలోచింపజేసేదిగా ఉంది. పెరుగుతున్న టెక్నాలజీని మనిషి అభివృద్ధికి వాడుకోవాలి తప్ప మానవ పతనానికి కాదు. తాజాగా స్మార్‌ఫోన్ గేమ్ అయిన పోకెమాన్ గో అదే కోవలోకి వస్తుంది. ఇలాంటి ‘గేమ్స్’ వల్ల ప్రమాదం ఉందని తెలిసినా.. వాటి పిచ్చిలో పడి యువత కొట్టుకు పోతోంది.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం)
**
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.