S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నచ్చని కవిత

నిజానికక్కడ ఏ పేరూ
తనకి సరిపోయేలా ఉండదు.
తనకి చెప్తున్నట్లుగా ఏ పదమూ అక్కడ
ఖాళీ చేసుకునవతరించదు...

ఆ అద్భుతమేదో చూద్దామనీ,
ఎంతకీ తెగని ఈ అసంపూర్తి వాక్యంలో
మా ఇద్దరి మధ్యా ఉండే ఆ మార్మిక భాషేదో
మధ్యలో రాసి
ఆ ఆఖరి పదమేదో అందంగా చేర్చి
కవిత పూర్తి చేయాలనుకుంటాను...

దూరాల్నుంచీ, దారుల్నుంచీ విడివడతాను...
లోకం నన్ను ఎగతాళిగా చూస్తుంది.
ఒక్క బాధ్యతా పట్టదా అని లోపలెక్కడో నిలదీస్తుంది...
నమ్మకంగా ముందు నిలబడి
నా లోకం మొత్తం నువ్వని నివేదించి
ఈ అక్షరాలెలా ఉన్నాయంటాను...

పెదాలు కదిపే పూల వెనుక నిలబడి
నా గుండె భాష మొత్తం
ఇక్కడ పదాలుగా రాసానంటూ
గొప్పగా చేతులు కట్టుకు నిలబడతాను...

నవ్వుతుంది
ఆగి మళ్లీ నవ్వుతూ అంటుంది
నిజమే కానీ ఓ మాట చెప్పు
ఇందులో నేనెక్కడైనా కనిపిస్తున్నానా అనడుగుతుంది...

చిట్లుతున్న ఒక్క శబ్దమూ చెవికి వినిపించదు...
నమ్మకంగా గుప్పిట కింద దాచుకున్న
గుండె వెనుక ముక్కలైన ఆశా శకలం
ఒక్కటి కూడా చేతికి దొరకదు...

తిరిగి ఇచ్చేసి వెళుతూ చెప్తుంది...
నిజంగా నా కోసం రాస్తే అది అద్భుతంగా ఉంటుంది...
ఎందుకంటే కనిపించే లోకం వొచ్చినంత సులువుగా
లేని ప్రేమెప్పుడూ కవితలోకి తపస్సు చేసినా నడిచి రాదుగా అని...
*
-సుపర్ణ మహి 9866716422

-సుపర్ణ మహి 9866716422