S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆణిముత్యాలు

భాగ్యనగరి ఆణిముత్యాలు కవర్‌స్టోరీ ఎంతో చక్కగా ఉంది. అంతర్జాతీయ వేదికలపై మెరుగైన ప్రదర్శన లిస్తున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు తెలుగు గడ్డపై సాధన చేసినవారే కావడం మనకు గర్వకారణం. రియో ఒలింపిక్స్‌లో పతకాలు తేలేదని విమర్శించేవారు ఆ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం, మెరుగైన సౌకర్యాల కల్పన, ఉజ్వల భవిష్యత్తు లేవన్న విషయం గుర్తించాలి. సౌకర్యాలు, మద్దతు, ఆదరణ లభించని ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే ఎంతో గొప్ప! ప్రభుత్వపరంగా క్రీడా విధానం మారనంత వరకు పతకాలను సాధించాలనుకోవడం అత్యాశే అవుతుంది.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
నమ్మండి...
ఈ శీర్షికన అందించిన ‘ఇరువురు స్నేహితుల’ కథ ఆశ్చర్యాన్ని కలిగించింది. జోవైట్‌హెడ్, స్టీవ్‌మారిస్ నిజమైన స్నేహ బంధానికి ప్రతీకలు. మానవతా విలువలు, అనుబంధాలు కనుమరుగవుతున్న నేటి కుటుంబ వ్యవస్థలో కన్నబిడ్డలను తల్లిదండ్రులను మరచిపోతున్న ఈ రోజుల్లో ఇద్దరు స్నేహితులు విడిపోయిన చోటే 40 సం.ల తరువాత తిరిగి కలుసుకొని ఆత్మీయత, అనురాగ బంధాలకు ప్రతీకలుగా నిలిచి లోకానికి స్ఫూర్తిదాతలయ్యారు.
-ఉప్పు సత్యనారాయణ (తెనాలి)
చివరి చీర
ఈ వారం కథ ‘చివరి చీర’ మాకెంతో నచ్చింది. రాన్రాను పట్టణీకరణ ఏ విధంగా మారిపోతోందో? పండుగల ప్రాశస్త్యం విశిష్టత ఏ విధంగా దిగజారిపోతున్నాయో కళ్లకు కట్టినట్టు చూపారు. పండుగలోని మాధుర్యం ఏమిటో తెలిపారు.
-గుండు రమణయ్య (పెద్దాపూర్)
అపూర్వం
మనవాళ్లు గతంలో సాధించినన్ని ఒలింపిక్ పతకాలు ఈసారి సాధించకపోయినా సింధు సాధించిన రజతం అపూర్వం. అద్భుత ప్రతిభ చూపిన క్రీడాకారుల్ని హైదరాబాద్‌కో, తెలంగాణకో, ఆంధ్రకో చెందినవారిగా కాక భారతీయులుగా పేర్కొంటే బాగుండేది. భగత్‌సింగ్ కథ చదివాక మనసు వికలం అయింది. మహాత్ముడు ఇప్పుడు బతికి ఉంటే ఐసిసి తీవ్రవాదుల్ని కూడా ‘వారి సాహసాన్ని మెచ్చుకోవలసిందే. తాము అనుకున్న దాని కోసం మతబద్ధమని తాము అనుకున్న పద్ధతిలో పోరాడుతున్నారని’ పొగడి అక్కున చేర్చుకునేవారేమో అనిపించింది.
-జె.్ధర్మతేజ (గొడారిగుంట, తూ.గో.జిల్లా)
తీయటి అనుభూతి
డైరీలు రాసి ఆ తర్వాత ఎప్పుడో చదువుకోవడం.. అలాగే మనకొచ్చిన పాత ఉత్తరాల్ని చదువుకోవడం గొప్ప అనుభూతి నిస్తుందని చెప్పిన ‘సండే గీత’ చదివాక ఒకనాటి మధుర స్మృతులు జ్ఞప్తికొచ్చాయి. కాని దురదృష్టం ఇప్పుడు డైరీలో మొదటి పేజీ నిండుతున్నది. మిగిలిన పేజీలన్నీ ఖాళీ! ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశమూ మరో దేశాన్ని దూరంగా పెట్టలేదు. ఇతర దేశాలు బహిష్కృత దేశానికి బాసటగా నిలిచి అంతర్జాతీయ వేదికల్లో నానా హంగామా చేసి న్యూసెన్స్ సృష్టించి, బహిష్కరించిన దేశానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఆమ్నెస్టీ లాంటి సంస్థల వ్యతిరేక ప్రచారం చూస్తూనే ఉన్నాం. అగ్రరాజ్యం క్యూబాని బహిష్కరించి ఏం చేయగలిగింది? బహిష్కరించకుండానే పాక్‌ని ఏకాకి చేసే ప్రయత్నం అయితే భారత్ చేస్తూనే ఉంది.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
గురు-గణాధిపతులు
ఈ దుర్ముఖి నామ సంవత్సర ప్రత్యేక విశేషమేమిటంటే - కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయుడైన గణాధిపతుని జన్మదినం, ప్రపంచ ప్రఖ్యాత మేధావులలో ఒకరిగా అఖండ కీర్తినార్జించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త అయితన గురుతుల్యులు, మాజీ రాష్టప్రతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు కూడా ఈ రోజే కావడంతో విద్యార్థులకిది పర్వదినం. పెద్దవారి ఆధ్వర్యంలో వినాయక చవితి పూజను చేసుకున్న పిన్నలకు శుభములు కలుగుగాక అంటూ పూజా విధానాన్ని ఆదివారం అనుబంధంలో ప్రచురించినందుకు ధన్యవాదాలు. సర్వేపల్లి వారు ఏభైకి పైగా గ్రంథ రచనలు చేశారు. అన్నీ ముఖ్యమైనవే అయినా ప్రముఖంగా ‘హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’ ‘ఈస్ట్ అండ్ వెస్ట్ రెలిజియన్’ లాంటి వాటిలోని కొన్ని విశేష భాగాలను అన్ని తరగతుల వారికి పాఠ్యాంశాలుగా చేయాలి.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)