S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవితంలో విద్యార్థి దశ కీలకం

విజయవాడ, సెప్టెంబర్ 24: జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకం, ఈ దశలో తీసుకునే నిర్ణయాలు చేసే పనుల వల్లనే జీవితంలో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ యువజనోత్సవాల్లో భాగంగా యంగ్ వింగ్స్ పేరుతో నగరంలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో రెండురోజులపాటు జరిగే వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ఇందులో తొలిరోజు యండమూరి, గజల్ శ్రీనివాస్, గంపా నాగేశ్వరరావు, వేణుగోపాల్, విశ్వనాధం, రత్నాకర్, వేణుగోపాల్ ప్రసంగించారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ లక్ష్యాలను నిర్దేశించుకుంటే సరిపోదని వాటిని చేరుకోవడానికి సిన్సియర్‌గా ప్రయత్నించాలన్నారు. టివి నటుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రదీప్ మాట్లాడుతూ ప్రతి వారికి కలలు వుంటాయి, దశ, దిశ లేకుండా ఉంటే ఏమీ సాధించలేమని, ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దాన్ని సాధించడానికి కష్టపడాలని చెప్పారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు జయసింహ మాట్లాడుతూ మనిషిలో చాలా తెలివితేటలు వుంటాయని, వాటిని ఏ విధంగా ఏ పనికి ఉపయోగించుకోవాలనే అంశాన్ని తెల్సుకోవాలని చెప్పారు. యండమూరి వీరేంద్రనాధ్ తన ప్రసంగంలో యువత శక్తివంతంగా తయారుకావడం ఎలా అనే అంశంతో పాటుగా ఇంటర్వ్యూల్లో పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేశారు. విశ్వనాధం, రత్నాకర్ మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం మనిషికి చాలా అవసరమని చెప్పారు. వేణుగోపాల్ మనిషిలోని భావాలను నియంత్రించుకోవడం ఎలా అనే అంశంపై మాట్లాడారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మనలోని చెడు అనే శత్రువును పారదోలాలని, అప్పుడే జీవితంలో ఉన్నత లక్ష్యాలకు చేరుకోగలమని అన్నారు. కార్యక్రమంలో యూత్ సర్వీసెస్ డైరక్టర్లు పార్ధసారధి, మున్సూర్, శివశంకర్, యూత్ సర్వీసెస్ చైర్మన్ సిహెచ్ ప్రసాద్, క్లబ్ సభ్యులు కిషన్‌బాబు, కార్యదర్శి కృష్ణప్రభుతో పాటు నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన 1500 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.