S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమన్వయంతో పని చేసి దోషులకు శిక్షపడేలా చేయాలి

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 24: పోలీసు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పని చేస్తూ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేయాలని జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్ పేర్కొన్నారు. ఇదే సమయంలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. హనుమాన్‌పేటలో కృష్ణాజిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నెలవారీ సమీక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ సిపి ఈసందర్భంగా పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లనుద్దేశించి ప్రసంగించారు. ఇతర దేశాల్లో దర్యాప్తు అధికారులతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నేరం జరిగినప్పటి నుంచి నిందితులకు శిక్షలు పడేవరకు దర్యాప్తులో సూచనలు, సలహాలు ఇస్తుంటారని అన్నారు. దీనిలో వల్ల క్రిమినల్ జస్టీస్ వ్యవస్థలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులు నెలవారీ సమీక్ష సమావేశాలు నిర్వహించడం ద్వారా పోలీసు, ప్రాసిక్యూషన్‌లో లోపాలను సవరించుకునే వీలుంటుందని, పోలీసు ఎఫ్‌ఐఆర్ నమోదు నాటి నుంచి ప్రాసిక్యూటర్లు సహాయ సహకారాలు తీసుకుని ఛార్జిషీట్లను కోర్టులో బలంగా వేయాలని సూచించారు. డెప్యూటీ పోలీసు కమిషనర్ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ పోలీసు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కొత్త చట్టాలపై అవగాహన పెంచుకుని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్ర అదనపు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ టి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కోర్టుకు ఒక ఏపిపి ఉన్నారని, కాబట్టి పోలీసులు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దర్యాప్తులో ఛార్జిషీట్లు తయారీలో పోలీసులకు సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్ చట్టం-2012, నిర్భయ చట్టంలో దర్యాప్తు విచారణకు సంబంధించిన సూచనలు చేశారు. అదేవిధంగా వైద్యాధికారులు మహిళలపై జరిగిన అత్యాచార కేసుల్లో ప్రాధమిక వైద్య రిపోర్టును 24గంటల్లో ఇవ్వాలని, పోలీసు అధికారులు బాధితుల స్టేట్‌మెంట్‌ను మహిళ మేజిస్ట్రేట్ ముందు 24గంటల్లోగా రిపోర్టు ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏపిపిలు ఎంపిప్రసన్నకుమార్, ఎం మధుసూదనరావు, జి రాజేశ్వరరావు, జి దైవప్రసాద్, పలువురు ఏసిపిలు, సిఐలు, జిల్లాలోని అన్ని కోర్టుల ఏపిపిలు, ప్రభుత్వ వైద్య అధికారులు పాల్గొన్నారు.