S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దోమల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరం

విజయవాడ, సెప్టెంబర్ 24: పరిసరాల్లోను, ఇళ్లలోను పరిశుభ్రత పాటించడం ద్వారా రాష్ట్రాన్ని దోమలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక 45వ డివిజన్, మధురానగర్‌లో శనివారం నిర్వహించిన ‘దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంలో డివిజన్‌లో నిర్వహించిన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దోమలు పెరిగేందుకు ఆస్కారం ఉన్న మురుగునీటి నిల్వలను పరిశుభ్రం చేయడం ద్వారా దోమలను నియంత్రించవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని నగర కార్పొరేషన్ సిబ్బంది చేపట్టినప్పటికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. కేవలం ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు ర్యాలీలు, అవగాహన సదస్సులు, ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. శ్రీలంక దేశంలో ఇదే మాదిరిగా దోమలపై విజయం సాధించడం జరిగిందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రంపై కూడా దృష్టి సారించాలనే ఉద్దేశంతో పాఠశాలల విద్యార్థులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. చెత్తను రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వేయకుండా నిర్దేశించిన చెత్తకుండీల్లో వేసే అలవాటును ప్రజలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కవర్లు వంటివి మురుగు కాలువల్లో వేయకుండా శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు.
విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దోమల వలన వ్యాప్తిచెందే మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి జ్వరాలు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. పదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఈ వ్యాధులు 10 శాతం మేర మాత్రమే వ్యాప్తిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దోమల నివారణకు పూనుకుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా దోమలపై యుద్ధం, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి అమలు చేయాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో గ్రామం, మండల, డివిజన్ స్థాయిల్లో దోమలపై యుద్ధం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోనేరు శ్రీ్ధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణ, స్థానిక కార్పొరేటర్ కె.రవికుమార్, కార్పొరేటర్ అదనపు కమిషనర్ అరుణ్‌కుమార్, మహిళా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు.