S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిరుపేదలకు ఇ - కామర్స్ విధానం అలవల్చటానికి జిల్లాలో శ్రీకారం

విజయవాడ, సెప్టెంబర్ 24: నిరుపేదలకు ఇ-కామర్స్ విధానం అలవర్చాలని ఉద్దేశంతో నగదు రహిత నిత్యావసర సరుకుల పంపిణీ విధానానికి జిల్లాలో శ్రీకారం చుట్టినట్లు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు ప్రపంచ బ్యాంక్ డాక్యుమెంటేషన్ బృందానికి వివరించారు. 3రోజులుగా జిల్లాలో పర్యటిస్తూ నేరుగా నగదు బదిలీ జిల్లాలో అమలుపై అధ్యయనం చేస్తున్న ప్రపంచ బ్యాంక్ డాక్యుమెంటేషన్ బృందం శనివారం స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇ-పోస్ తదితర నేరుగా నగదు బదిలీ అమలును అధ్యయనం చేశామని, దానిని విజయవంతం చేయడంపై అధికారుల అభిప్రాయాలను డాక్యుమెంటేషన్ చేయదలచామని బృందం సభ్యులు జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వంద రూపాయల నగదు కాగితాన్ని ప్రింట్ చేసేందుకు సుమారు 22 శాతం ప్రభుత్వానికి ఖర్చు అవుతోందన్న అంశాన్ని పరిగణలోనికి తీసుకుని నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఆన్‌లైన్ పేమెంట్స్ విధానాన్ని ప్రోత్సహించదలచామని వివరించారు. ఇదే విధానం పలు దేశాల్లో అమలులో ఉండటం తాము ఆయా దేశాల్లో పర్యటించనప్పుడు గమనించామన్నారు. ఈ ఈ సమావేశంలో కృష్ణా జిల్లా డిడివో అనంతకృష్ణ, ప్రపంచ బ్యాంక్ డాక్యుమెంటేషన్ బృందం సభ్యులు సునీత, వసుమితులు పాల్గొన్నారు.