S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అప్రమత్తం

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 24: ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక టిటిడిసిలో జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల ఏర్పడిన నష్టంపై కలెక్టర్ లోకేష్‌కుమార్‌తోపాటు అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వర్షాల వల్ల మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఏ ఒక్కరు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళరాదన్నారు. వర్షాల వల్ల ఏర్పడిన తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా నష్టం జరిగిన పక్షంలో మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులంతా కలిసి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్‌కు విషయం తెలియచేసి సహాయం పొందాలన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులకు వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. కోదాడ నుంచి ఖమ్మం వరకు రోడ్డుపై భారీ వర్షానికి గుంతలు ఏర్పడినట్లు ఎస్‌హెచ్ ఈఈ చెప్పటంతో కోదాడ నుంచి ఖమ్మంకు జాతీయ రహదారులు పనులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాలేరు రిజర్వాయర్ ఇన్‌ఫ్లో ప్రకారంగా నీటిని విడుదల సందర్భంలో వైరా, కల్లూరు, మధిర ప్రాంతాల్లోని ఎండిన చెరువులకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మునే్నటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు ఈ నెల 28వ తేదీ వరకు ఉండే అవకాశం ఉన్నందున పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలు ప్రమాదాలు నష్టం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు నష్టం జరగలేదని, గృహాలు కూలిన పక్షంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం బాధితులకు నష్ట పరిహారం అందించాలన్నారు. వర్షాలు కురిసిన సందర్భంలో సంబంధిత అధికారులకు నివేదిక సమర్పిస్తే ప్రభుత్వానికి అందించటం జరుగుతుందన్నారు.

తాత్కాలిక మరమ్మతులకు ప్రతిపాదనలు
గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు రూ. 3.70 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి కలెక్టర్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా 41 చేతి పంపులను, రోడ్లు భవనాల శాఖ 60 కల్వర్టులు, ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు ఇతర ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల రోడ్లు గుంతలు ఏర్పడినట్లు తక్షణ మరమ్మతులకు 1.11కోట్లు శాశ్వత పనులు చేపట్టేందుకు అవసరం ఉందన్నారు. శాశ్వత మరమ్మతులకు 30కోట్లు అవసరం ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 43చోట్ల రోడ్లకు నష్టం వాటిల్లిందని తాత్కాలిక మరమ్మతులకు కోటి రూపాయలు అవసరం కాగా, శాశ్వత మరమ్మతులకు 8 కోట్లు అవసరం ఉందన్నారు. జాతీయ రహదారులు 32.2కిలోమీటర్ల రోడ్లు గుంతలు ఏర్పడి 1.21కోట్లు తాత్కలిక మరమ్మతులకు అవసరం ఉందన్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా జూలై మాసంలో 11చెరువులు తాత్కలిక మరమత్తులకు 38లక్షలు, శాశ్వత మరమత్తులకు3.35కోట్లు అవసరం ఉంటుందన్నారు. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 3చెరువులు డ్యామేజ్ అయ్యాయని తాత్కలిక మరమ్మతులకు 6 లక్షలు అవసరం ఉందన్నారు. కొత్తగూడెం వ్యవసాయశాఖ పరిధిలో పంట నష్టం జరిగిందని, బాధితులందరికీ పరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మంత్రి తుమ్మలకు వివరించారు. సమావేశంలో డిఆర్వో శివ శ్రీనివాస్, సిపివో జడ్ రాందాస్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుండగా వీటన్నింటికీ శాశ్వత మరమ్మతులకు గాను 41.35కోట్లు నిధులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు.
అలెర్ట్
భద్రాచలం, సెప్టెంబర్ 24: గోదావరి వరద ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రాష్ట్ర సర్కారు భావించి హై అలర్ట్ ప్రకటించింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్టల్రో గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురియడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. మరో వైపు మన రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు కూడా ప్రమాదస్థాయిలో వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 3లక్షల క్యూసెక్కుల జలాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి తోడు ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్బ మీదుగా అల్పపీడనానికి సమాంతరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కినె్నరసాని వంటి ఉపనదుల పరివాహకంలో కుంభవృష్టి కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో సరాసరిగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో గోదావరికి వరద ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ పరివాహక ప్రాంత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్థాయి నుంచి మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులంతా వర్షాల వల్ల తలెత్తే ఇబ్బందులపై గ్రామాల్లో దృష్టిసారించాలని ప్రభుత్వం సూచించింది. గోదావరి వరదలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 24: ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక టిటిడిసిలో జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల ఏర్పడిన నష్టంపై కలెక్టర్ లోకేష్‌కుమార్‌తోపాటు అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వర్షాల వల్ల మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఏ ఒక్కరు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళరాదన్నారు. వర్షాల వల్ల ఏర్పడిన తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా నష్టం జరిగిన పక్షంలో మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులంతా కలిసి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్‌కు విషయం తెలియచేసి సహాయం పొందాలన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులకు వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. కోదాడ నుంచి ఖమ్మం వరకు రోడ్డుపై భారీ వర్షానికి గుంతలు ఏర్పడినట్లు ఎస్‌హెచ్ ఈఈ చెప్పటంతో కోదాడ నుంచి ఖమ్మంకు జాతీయ రహదారులు పనులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాలేరు రిజర్వాయర్ ఇన్‌ఫ్లో ప్రకారంగా నీటిని విడుదల సందర్భంలో వైరా, కల్లూరు, మధిర ప్రాంతాల్లోని ఎండిన చెరువులకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మునే్నటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు ఈ నెల 28వ తేదీ వరకు ఉండే అవకాశం ఉన్నందున పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలు ప్రమాదాలు నష్టం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు నష్టం జరగలేదని, గృహాలు కూలిన పక్షంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం బాధితులకు నష్ట పరిహారం అందించాలన్నారు. వర్షాలు కురిసిన సందర్భంలో సంబంధిత అధికారులకు నివేదిక సమర్పిస్తే ప్రభుత్వానికి అందించటం జరుగుతుందన్నారు.
తాత్కాలిక మరమ్మతులకు ప్రతిపాదనలు
గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు రూ. 3.70 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి కలెక్టర్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా 41 చేతి పంపులను, రోడ్లు భవనాల శాఖ 60 కల్వర్టులు, ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు ఇతర ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల రోడ్లు గుంతలు ఏర్పడినట్లు తక్షణ మరమ్మతులకు 1.11కోట్లు శాశ్వత పనులు చేపట్టేందుకు అవసరం ఉందన్నారు. శాశ్వత మరమ్మతులకు 30కోట్లు అవసరం ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 43చోట్ల రోడ్లకు నష్టం వాటిల్లిందని తాత్కాలిక మరమ్మతులకు కోటి రూపాయలు అవసరం కాగా, శాశ్వత మరమ్మతులకు 8 కోట్లు అవసరం ఉందన్నారు. జాతీయ రహదారులు 32.2కిలోమీటర్ల రోడ్లు గుంతలు ఏర్పడి 1.21కోట్లు తాత్కలిక మరమ్మతులకు అవసరం ఉందన్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా జూలై మాసంలో 11చెరువులు తాత్కలిక మరమత్తులకు 38లక్షలు, శాశ్వత మరమత్తులకు3.35కోట్లు అవసరం ఉంటుందన్నారు. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 3చెరువులు డ్యామేజ్ అయ్యాయని తాత్కలిక మరమ్మతులకు 6 లక్షలు అవసరం ఉందన్నారు. కొత్తగూడెం వ్యవసాయశాఖ పరిధిలో పంట నష్టం జరిగిందని, బాధితులందరికీ పరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మంత్రి తుమ్మలకు వివరించారు. సమావేశంలో డిఆర్వో శివ శ్రీనివాస్, సిపివో జడ్ రాందాస్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుండగా వీటన్నింటికీ శాశ్వత మరమ్మతులకు గాను 41.35కోట్లు నిధులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు.
విస్తరించనున్న సింగరేణి
కొత్తగూడెం, సెప్టెంబర్ 24: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటివరకు నాలుగు జిల్లాలైన ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధి నుండి దసరా నుండి ఐదు జిల్లాల పరిధికి మారనుంది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న కొత్తగూడెం రీజియన్ బొగ్గు గనులు నూతన జిల్లాల ఏర్పాటు, అనంతరం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు విస్తరించనున్నాయి. కొత్తగూడెం ఏరియాలో ఉన్న సత్తుపల్లి జెవిఆర్ ఓపెన్ కాస్ట్ గని ఖమ్మం జిల్లా పరిధిలోకి వెళ్లనుంది. అదేవిధంగా ఇప్పటివరకు కరీంనగర్ పరిధిలో ఉన్న బొగ్గు గనులు పెద్దపల్లి జిల్లాలోకి వెళ్లనుండడంతో బొగ్గు గనులు కరీంనగర్ జిల్లా పరిధి నుండి నిష్క్రమించనున్నాయి. దీంతోపాటు వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న గనులు కూడా నూతనంగా ఏర్పాటు కానున్న ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా పరిధిలోకి వెళ్ళనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గనులు నూతన జిల్లా అయిన కొమరంభీం పరిధిలోకి వెళ్లనున్నాయి. కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలో ఒక ఓపెన్ కాస్ట్ గని, రెండు భూగర్భ గనులు, మణుగూరు ఏరియాలో రెండు ఓపెన్ కాస్ట్ గనులు, ఇల్లందు ఏరియాలోని రెండు ఓపెన్ కాస్ట్ గనులు ఉంటాయి.
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గని మాత్రమే ఉంటుంది. త్వరలో సత్తుపల్లిలో మరో ఓపెన్ కాస్ట్ గని ప్రారంభించడానికి సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలోకి రామగుండం-1, రామగుండం-2, రామగుండం-3 ఏరియాలు, శ్రీరాంపూర్ ఏరియా, ఆడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌లు రానున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలో భూపాల్‌పల్లి ఏరియా, కొమరంభీం జిల్లాలో బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలు రానున్నాయి. జిల్లాల పేర్లు మారుతున్న ఏరియాలు మాత్రం సింగరేణి పరిధిలో ఇప్పటికీ 11 మాత్రమే ఉంటాయి.
వైద్య విద్యాశాఖ విభజన
భద్రాచలం, సెప్టెంబర్ 24: జిల్లాల పునర్విభజనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ విభజన దాదాపు ఒక కొలిక్కి వచ్చింది.
విభజనపై ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నారు. తొలుత భద్రాచలంలో ఉన్న అడిషనల్ డిఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం కొత్తగూడెం తరలిపోతుందని అంతా భావించినప్పటికీ ఐటిడిఏతోనే ఆ కార్యాలయం కొనసాగుతుంది. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల విస్తరణకు ఈ కార్యాలయమే కీలకం. డిఎంఅండ్‌హెచ్‌ఓతో కార్యాలయం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల పర్యవేక్షణకు మాత్రం అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం భద్రాచలం ఐటిడిఏలో ఉంటుంది.
జిల్లాలో 57 పిహెచ్‌సిలు ఉండగా, ఖమ్మం జిల్లాకు 23, కొత్తగూడెం జిల్లాకు 31 పిహెచ్‌సీలను కేటాయించారు. సిహెచ్‌సిలు జిల్లాకు ఐదు చొప్పున విభజించారు. మహబూబ్‌బాద్ జిల్లాలో విలీనం కానున్న బయ్యారం, గార్ల మండలాల్లోని బయ్యారం, గార్ల, గంధంపల్లి పిహెచ్‌సిలు ఆ జిల్లాకు ( బదలాయిస్తారు.
జిల్లాస్థాయి ఉద్యోగులకు స్థానచలనం
జిల్లా స్థాయిలో పనిచేస్తున్న 105 మంది ఉద్యోగులకు స్థానచలనం కలుగనున్నది. వీరి జాబితా ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరింది. డిఎంఅండ్‌హెచ్‌ఓ, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఓ, లెప్రసీ, జిల్లా మలేరియా అధికారి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకే బదిలీ జరగనుంది. వీరిని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు. పిహెచ్‌సిల్లో పనిచేసే సిబ్బందికి మాత్రం బదిలీలు ఉండట్లేదు. ఎక్కడి వారు అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. మరో వైపు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఒక్కో జిల్లాకు 5 చొప్పున కేటాయించారు. వెంకటాపురం, చర్ల, అశ్వారావుపేట, పాల్వంచ, బూర్గంపాడులు కొత్తగూడెంకు, మధిర, నేలకొండపల్లి, జూలూరుపాడు, బనిగండ్లపాడు, కల్లూరులు ఖమ్మంకు కేటాయించారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి ఏరియా ఆసుపత్రులు ఖమ్మంకు, కొత్తగూడెం, భద్రాచలం ఏరియా ఆసుపత్రులను కొత్తగూడెం జిల్లాకు కేటాయించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల విభజన ఇలా...
----------------------------------------
విభాగం ఖమ్మం కొత్తగూడెం
----------------------------------------
అల్లోపతి 5 7
ఆయుర్వేదం 8 9
హోమియోపతి 15 10
యునాని 3 1
నేచురోపతి 0 2
ప్రభుత్వ వైద్యులు 31 12
ప్రభుత్వ పడకలు 624 563
హస్తకళలను ప్రోత్సహించాలి
ఖమ్మం(కల్చరల్), సెప్టెంబర్ 24: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపువారసత్వ కళ అయిన చేనేత, హస్తకళలను ఖమ్మం ప్రజలు ప్రోత్సహించాలని స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. కళాభారతి ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన మరియు అమ్మకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కళా నైపుణ్యం కలిగిన కళాకారులు ఖండాంతర ఖ్యాతిని అర్జించిన గొప్ప చరిత్ర మనదన్నారు. దేశ ప్రజల ఆదరణ, ప్రోత్సాహంతోనే గొప్పగా విరాజిల్లుతుందన్నారు. నేటి ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహం కనబర్చకనే కళలు అంతరించే ప్రమాదం పొంచిందన్నారు. ఎంతో కొంత ప్రజాదరణ ఉండబట్టే ఇంకా కళాకారులు తమ కళాఖండాలను ప్రదర్శనల ద్వారా అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు. మన కళలను మనమే బతికించుకోవల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. కళాభారతి అధ్యక్ష, కార్యదర్శులు జెల్లా సత్యనారాయణ, వడ్డెపల్లి రమేష్‌లు పాల్గొన్నారు.
ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించండి
కొత్తగూడెం, సెప్టెంబర్ 24: సింగరేణి పురోభివృద్ధికి భూగర్భగనులలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, ఉత్పత్తి వ్యయం కూడా అమ్మే సందర్భంలో రాని దుస్ధితి నెలకొందని జనరల్ మేనేజర్లు ఎన్ నాగేశ్వరరావు, ఎ ఆనందరావు, పి ఉమామహేశ్వరరావులు ఆన్నారు. శనివారం జరిగిన మల్టీ డిపార్టుమెంటల్ కార్పోరేట్ ఏరియా ముగింపు సమావేశంలో వారు మాట్లాడారు. ఈఆర్ధిక సంవత్సరంలో 660.60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాల్సి ఉన్న తరుణంలో ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యంత్రవినియోగ సమయాన్ని కూడా పెంచాలని సూచించారు. సవాళ్లను ఎదుర్కొని సింగరేణిని మరింత బలోపేతం చేయడానికి అంకితభావం, సమిష్టికృషి అవసరమన్నారు. కార్యక్రమంలో అధికారులు నరసింహమూర్తి, ఎన్‌ఎస్ చక్రవర్తి, రాజీవ్‌కుమార్, యూనియన్ నాయకులు కొమరయ్య, ఎం సోమిరెడ్డి, జెబి మోహన్‌లు పాల్గొన్నారు.
విదేశీబొగ్గు దిగుమతి సింగరేణికి తప్పని సవాళ్ళు
విదేశీబొగ్గు చౌకగా దిగుమతి అవుతున్న కారణంగా సింగరేణి సంస్ధ సవాళ్లను ఎదురొంటున్నదని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ రమణమూర్తి అన్నారు. శనివారం జరిగిన మల్టీడిపార్టుమెంటల్ సమావేశాలలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఓటుజిఎం షాలెంరాజు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈకార్యక్రమంలో అధికారులు సురేష్, చంద్రవౌళి, కెవివి సత్యనారాయణ, పి శ్రీనివాస్, జోతి, కెజి తివారి, చంద్రకాంత్, పాండురంగారావు. యూనియన్ నాయకులు సంగెం చందర్ పాల్గొన్నారు.
దోషులెవరో తేల్చండి
భద్రాచలం, సెప్టెంబర్ 24: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆభరణాల మాయం వివాదం మళ్లీ రాజుకుంటోంది. దోషులెవరో తేల్చాలంటూ అర్చకులు అంతా కలిసి శనివారం దేవస్థానం ఈఓ సీసీ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. గత నెలలో నిత్యకల్యాణమూర్తులకు వినియోగించే ఆభరణాల్లో లాకెట్‌తో పాటు గొలుసులు మాయమైన సంగతి విదితమే. దీనిపై ఈఓ రమేశ్‌బాబు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడం, అర్చకులంతా నగల బీరువాను పరిశీలించడం, హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారి కూడా స్వామి వారి నగలను లెక్కించి నివేదిక ఇవ్వడం, వారం తర్వాత తిరిగి ఆభరణాలు దొరికాయంటూ అర్చకులే చూపించడం...తదితర ఆసక్తికర మలుపుల మధ్య వివాదం ముగిసినట్లేనని అధికారులు ప్రకటించారు. ప్రధానార్చకులను వాటి పర్యవేక్షణ నుంచి తొలగించి, ఉపప్రధానార్చకులు, ముఖ్య అర్చకులకు ఈఓ బాధ్యతలు అప్పగించారు. అంత వరకు బాగానే ఉన్న ఇటీవల మళ్లీ ఆ నగల విషయంలో బాధ్యతల నుంచి తప్పించిన ప్రధానార్చకుల పెత్తనం పెరగడంతో అర్చకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నిత్యకల్యాణంలో లక్ష్మణస్వామికి లాకెట్ వేయడం లేదంటూ వార్తలు రావడం వాటికి మరమ్మత్తులు చేయించి తిరిగి అలంకరించడం వంటి విషయాల్లో సదరు ప్రధానార్చకుడి మితిమీరిన జోక్యంతో వివాదం తిరిగి రాజుకుంది. బయటకు వెళ్తే తమ పరువు పోతోందంటూ గురువారం రాత్రి అర్చకులంతా సమావేశమై వాపోయారు. ఆ నగల మాయం, తిరిగి ప్రత్యక్షం కావడం వెనుక ఉన్న దోషులెవరో తేల్చి శిక్షించాలని అప్పుడే అర్చకులపై పడ్డ నింద తొలుగుతుందంటూ అర్చకులు వేడుకుంటున్నారు. సద్దుమణిగిందనుకున్న వివాదం కాస్తా తిరిగి రాజుకోవడంతో దీంట్లో తలదూర్చిన ప్రభుత్వ పెద్దలు సంశయంలో పడ్డారు. పోలీసు కేసు ఎందుకు నీరుగారింది? దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు? వారికెందుకు అంతటి జోక్యం? వంటి ప్రశ్నలను అర్చకులు సంధిస్తున్నారు. దీంతో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది.

మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టత కోసమే ఈనామ్
* 27, 28 తేదీల్లో స్టడీ టూర్లు * జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు
ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 24: మార్కెట్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈనామ్) విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చర్యలు చేపడుతున్నాయని మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రైతులకు ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయత వ్యవసాయ మార్కెట్(ఈనామ్) పథకం రాష్ట్రంలో 44 మార్కెట్‌ల్లో పకడ్బందీగా నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 13వ తేదీన మార్కెట్ చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఈనామ్‌పై నిత్యం సమీక్షలు జరుపుతోందన్నారు. మార్కెట్ కేంద్రాల్లో ఈ పథకం అమలు చేయడం ద్వారా వ్యవస్థను పటిష్టంగా నడిపించడంతో పాటు సరళీకృత విధానం ఏర్పడుతుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సరుకును ఎక్కడి నుంచైనా అమ్ముకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఈనామ్ అమలు కొంత అసంతృప్తిగా ఉందని, దీనిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రైతుల్లో, వర్తకుల్లో అపోహలు తొలగించేందుకు ఈ నెల 27, 28 తేదీల్లో వంరగల్, నిజామాబాద్ మార్కెట్లలో ఈనామ్ విధానం అమలు తీరును వారికి చూపించనున్నట్లు తెలిపారు.
పారదర్శక పాలనే లక్ష్యం
ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 24: జిల్లా ప్రజాపరిషత్‌లో రెండు నెలలకు ఒక సారి జరిగే స్థారుూ సంఘాల సమావేశం శనివారం జిల్లా పరిషత్‌లో సాదాసీదాగా జరిగింది. జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాత్రమే పాల్గొన్నారు. రెండవ స్థాయి సంఘం గ్రామీణాభివృద్ధిపై జరిగిన సమావేశంలో డిఆర్‌డిఏ అధికారులు ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో ఆసరా పెన్షన్ల కింద 2,72,179మందికి 30కోట్ల 4లక్షల 27,500రూపాయలను అందిస్తున్నామన్నారు. సెట్‌కం ద్వారా ఆగస్టు నెలలో 500మొక్కలు నాటినట్లు అధికారులు వెల్లడించారు. వీటన్నింటిపై స్పందించిన దుమ్ముగూడెం జడ్పీటిసి అనె్న సత్యనారాయణ, జానమ్మ తదితరులు మాట్లాడుతూ జిల్లాలో ఆసరా పెన్షన్లు క్షేత్రస్థాయిలో అనేక మంది అందటం లేదని, కొంతమంది అధికారులు పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో అలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. 3వ స్థాయి సంఘం వ్యవసాయశాఖపై జెడిఏ వ్యవసాయ శాఖ అందిస్తున్న కార్యక్రమాలు వివరించగా, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జీయావుద్దీన్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖాధికారులు తూతూమంత్రంగానే తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ శాఖ పటిష్టంగా పనిచేస్తే గ్రామాల్లో నకిలీ విత్తనాల జోరు ఉండదన్నారు. కొణిజర్లలో నకిలీ విత్తనాలపై కేసు నమోదు చేస్తామని చెప్తున్న అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేయించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకరు అలాంటి పనులు చేయటానికి భయపడతారన్నారు. అదే విధంగా మార్కెటింగ్‌లో ఈనామ్ తదితరాలు అమలు కావటం లేదని, వ్యాపారులకే అండగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ నెల 14వ తేదీన పెసలు విక్రయానికి ఇద్దరు రైతులే వచ్చారా జిల్లా మార్కెట్‌కు ఇద్దరు రైతులు విక్రయానికి వచ్చారంటే పరిస్థితి ఏలా ఉందో అర్థమవుతుందన్నారు. 4వ స్థాయి సంఘం విద్య,వైద్య, 5వ స్థాయి సంఘం మహిళా సంక్షేమం, 6వ స్థాయి సంఘం సాంఘిక సంక్షేమం, 7వ స్థాయి సంఘం పన్నులపై నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ బరపాటి వాసుదేవరావు, సిఈఓ మారుపాక నగేష్, ఏవో భారతి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పారదర్శక పాలన
ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. స్థారుూ సంఘాల సమావేశం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు దశల వారిగా సమస్యలను పరిష్కరిస్తూ ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు.