S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దోమలపై సమరం

ఏలూరు, సెప్టెంబర్ 24 : ఒక్కో సీజన్‌లో దోమలు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ కారణంగా వ్యాధులు ప్రబలి మధ్యతరగతి, పేద కుటుంబాల భవిష్యత్తు తల్లకిందులవడం చూస్తూనే వున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దోమల ప్రభావం గట్టిగా కనిపిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యాలు నెరవేరితే ఒక రకంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా భారీ అడుగులు వేసినట్లే చెప్పుకోవాలి. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఏలూరులో ప్రారంభించారు. ఇంతటి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని జిల్లా వేదికగా ప్రారంభించడం విశేషంగానే చెప్పుకోవాలి. అంతేకాకుండా కార్యక్రమం ఆరంభం నుంచి దోమలపై దండయాత్ర అంశంపై ప్రభుత్వం ఎంత సీరియస్‌గా వుందో స్పష్టంగా తెలియజెప్పే విధంగానే ముఖ్యమంత్రి పర్యటన సాగడం విశేషం. ఈ సందర్భంగానే రాష్ట్రంలో సాధిస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూనే సాధించాల్సిన లక్ష్యాలను కూడా నిర్ధేశిస్తూ విమర్శలు గుప్పించిన విపక్ష నేతపై పరోక్షంగా చురకలు అంటిస్తూ ఆయన ప్రసంగం సాగిపోయింది. శనివారం నాటి ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగానే దోమలపై దండయాత్ర చేయాల్సిందేనన్న స్పష్టమైన అభిప్రాయం దిశగా అడుగులు పడ్డాయనే చెప్పాలి. తొలుత స్థానిక సర్ సి ఆర్ ఆర్ కళాశాలలో హెలికాప్టర్ ద్వారా దిగిన సి ఎం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా జడ్పీకి చేరుకుని విద్యార్ధినీ విద్యార్ధులతో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. స్వయంగా సి ఎం ప్లకార్డు పట్టుకుని ఈ ర్యాలీలో ముందు వరుసలో నిలబడటం విశేషం. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి నేరుగా ర్యాలీ స్థానిక సురేష్‌చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్‌కు చేరుకుంది. చెత్త ఎత్తే మినీ వాహనాలను ఆయన పంపిణీ చేశారు. మొక్కలు నాటారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధినీ విద్యార్ధులు దోమలపై దండయాత్ర అంశం కేంద్రంగా ప్రదర్శించిన స్కిట్‌ను వీక్షించారు. విద్యార్ధులను విశేషంగా అభినందిస్తూనే చిన్నమాటలతో చిన్న స్కిట్‌తో ప్రభుత్వ కార్యక్రమ లక్ష్యాన్ని స్పష్టంగా వివరించారంటూ వారికి ప్రశంసలు తెలిపారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దోమలు, అవి కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు వంటి వాటిని వివరించారు. దోమలు వల్ల అయిదు ప్రధానమైన వ్యాధులు ప్రబలుతున్నాయని, దీని నుంచి అప్రమత్తంగా వుండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన కష్టాలను వివరిస్తూనే సమస్యల్లోనే అవకాశాలను అనే్వషించే పాజిటివ్ దృక్పధంతో తాను మొండి పట్టుదలతో ముందుకు వెళుతున్నానన్నారు. అలాగే దోమల నివారణ అంశానికి తన ప్రసంగంలో పెద్దపీట వేసి లక్ష్యసాధనకు ప్రభుత్వం కట్టుబడి వుందన్న అంశాన్ని మరింత స్పష్టం చేశారు. ఇక రాష్ట్భ్రావృద్దికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అభివృద్ధి పధంలో ముందుకు సాగుతున్న అంశాన్ని వివరించారు. ఈ సందర్బంగానే ఇటీవల ఏలూరులో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి చేసిన విమర్శలను ధీటుగానే పరోక్షంగా తిప్పికొట్టారు. హోదాకు మించిన ప్రయోజనం కలుగుతుందన్న నమ్మకంతోనే ప్యాకేజీకి అంగీకరించినట్లు పేర్కొన్నారు. .
పోలీసు స్కూల్‌లో పరిస్థితి ఆశాజనకంగా లేదని, దీన్ని అభివృద్ధి చేసేందుకు 25 లక్షల రూపాయలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మళ్లీ ఇంకోసారి చెప్పకుండా వస్తానని, అప్పటికీ పరిస్థితి బాగుపడకపోతే ప్రిన్సిపాల్‌ను పట్టుకుంటానని చెప్పారు.
జిల్లాలోనూ పరిస్థితిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చాల్సిన అవసరం వుందని, డిసెంబరుకల్లా జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు సిద్ధం కావాలని సి ఎం చెప్పారు. కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏలూరు ఎంపి మాగంటి బాబు, నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఎమ్మెల్యేలు కలవపూడి శివ, కె ఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్ బి రామాంజనేయులు, రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనంమాలకొండయ్య, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.