S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కథలొద్దు... చేసింది చెప్పండి!

ఏలూరు, సెప్టెంబర్ 24: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏలూరులో ప్రారంభించారు. అయితే దీనిలో కొంత ఆసక్తికరమైనరీతిలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాధారణంగా ఇలాంటి సభల్లో రాజకీయనాయకులు తమ వక్తృత్వ ప్రతిభను పూర్తిస్ధాయిలో ప్రదర్శించటం చూస్తుంటాము. కానీ ఈసభలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా జరిగింది. ప్రజాప్రతినిధుల ప్రసంగాలకు స్వయంగా ముఖ్యమంత్రే అడ్డుతగలగా మరికొంతమంది అధికారులు మాత్రం నాయకులకు దీటుగా ప్రసంగాలు చేయటం విశేషం. కాగా ఈ కార్యక్రమం ప్రారంభంలో ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. వేదికపెవున్న ఒక్కొక్కరిని పేర్కొంటూ ముందుకు సాగుతుండగా ముఖ్యమంత్రి మైక్‌ను తీసుకుని ఇలాంటి కధలు చెప్పకండి...అసలు లక్ష్యానికి సంబంధించి ఏం చేశారన్నదే ముఖ్యమంటూ పేర్కొన్నారు. ఈసమయంలో చింతమనేని ‘సార్...సార్’ అంటూ ఏం చేసింది కూడా చెపుతానంటూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు మాత్రం అంతకుమించిన పట్టుదలతో చింతమనేనిని అడ్డుకుంటూనే చివరకు శుక్రవారంనాటి తన పర్యటన గురువారం రాత్రి మాత్రమే ఖరారు అయిందని, అయినప్పటికీ తాను దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని అందించామని చెప్పారు. ప్రభుత్వం దోమల నిర్మూలనపై ఎంత సీరియస్‌గా ఉందో మీకు తెల్సిందేనని, అందుకే పాఠశాలలకు శనివారం శెలవు ప్రకటించానని, అయితే వారి ద్వారా ర్యాలీలు నిర్వహించి జనంలో చైతన్యం తెచ్చి ఒక్కొక్క విద్యార్ధి 25కుటుంబాల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఆ నిర్ణయం తీసుకుంటే మీరు స్కూళ్లకు శెలవు ఇచ్చి పిల్లలను ఇంటికి పంపేశారని పేర్కొన్నారు. ఆసమయానికి సభలో పూర్తిస్ధాయిలో విద్యార్దినీవిద్యార్ధులు లేకపోవటం గమనార్హం. దీంతో చింతమనేని జోక్యం చేసుకుని అలాకాదు సార్...బయట వేలమంది పిల్లలు ఉండిపోయారని, వారిని కూడా తీసుకువస్తామని చెప్పారు. అయినప్పటికీ సిఎం సమాధానపడలేదు. అదే సమయంలో మళ్లీ మైక్ తీసుకుని బాబూ...పోలీసులు బయట ఉన్న పిల్లలను లోపలకి పంపాలని సూచించారు. మిమ్మల్ని చూసి భయపడి కొంతమంది వెళ్లిపోతున్నారని, ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమం లక్ష్యాన్ని అర్ధం చేసుకుని దానికి అనుగుణంగా విధినిర్వహణ ఉండాలని, అది ఇంతవరకు పోలీసులకు అలవాటు కావటం లేదంటూ చురక అంటించారు. చివరకు చింతమనేని మళ్లీ జోక్యం చేసుకుని మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని, క్షమించాలంటూ విజ్ఞప్తి చేయటంతో చంద్రబాబు శాంతించారు.
మంత్రి సుజాతకూ...
ఇక ఆ తర్వాత మంత్రి పీతల సుజాతకు కూడా ఇలాంటి అనుభవమే తప్పలేదు. మంత్రి పీతల సుజాత ప్రసంగం ప్రారంభిస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అన్ని పేర్లు అక్కర్లేదు...సభకు నమస్కారం అంటూ మొదలుపెట్టండని స్పష్టం చేశారు. అప్పటికే మంత్రి సుజాత ప్రసంగం ప్రారంభించి వేదికపై ఉన్న ప్రతిఒక్కరి పేరును చదువుతూ వారి అందరికి పేరుపేరునా ధన్యవాదాలు చెపుతూ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి ఈ చురక అంటించటంతో ఆమె తనప్రసంగాన్ని కుదించుకున్నట్లు కన్పించింది. ఇక ఈ సభలో మరో విశేషంగా చెప్పుకునేది ఏమిటంటే నాయకులు క్లుప్తంగా ప్రసంగించి తప్పుకోగా కొంతమంది అధికారులు మాత్రం నేతల కన్నా అధికంగా ప్రశంసల జల్లు కురిపిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ఏకరువు పెడుతూ ముందుకు సాగటం ప్రత్యేకంగా కన్పించింది. పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ బి రామాంజనేయులు, డిఇఓ డి మధుసూదనరావు, సిఎం ప్రశంసలు పొందిన ఇన్‌ఛార్జి హెచ్‌ఎం టి అప్పారావు తదితరులు ఈకోవలోకి వస్తారనే చెప్పాలి.
ఊదరగొట్టిన ఎంపిడిఓ
ఏలూరు ఎంపిడిఓ ప్రకాశరావుది ఒక ప్రత్యేకమైన శైలి. ఎక్కడ సభ జరిగినా మైక్ అందితే వదిలిపెట్టరు... అదే పరిస్దితి ముఖ్యమంత్రి సభ ప్రారంభం అయ్యే ముందువరకు సభికులను నానాఇబ్బందులపాలు చేసింది. మధ్యమధ్యలో ఒకరిద్దరు చేత మిమిక్రీలు, మాట్లాడే బొమ్మ వంటి కార్యక్రమాలను కొన్ని నిముషాలపాటు నిర్వహింపచేసి మిగిలిన గంటల తరబడి ఎంపిడిఓ తన వాగ్ధాటితో సభికులను ఊదరగొట్టారనే చెప్పాలి. ఇక సిఎం వచ్చేస్తున్నారన్న సమాచారం రాగానే ఆయన ఆహ్వానపత్రంలో ఉన్న ప్రతిఒక్కరి పేరు పలుమార్లు చదువుతూ వారందర్ని స్వాగతిస్తూ వచ్చారు. ఇది అభ్యంతరం కాకపోయినా అలా ఒకసారి కాకుండా దాదాపు డజన్‌సార్లు ఏకధాటిగా చేయటమే ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు ఆహ్వానపత్రంలో ఆయన చదివిన ప్రజాప్రతినిధుల్లో కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకావటం మరో విశేషం.