S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24: జిల్లాలో కురుస్తున్న వర్షాలు జిల్లా ప్రజలకు శుభసూచికమని చెరువులు, కుంటలు నిండాయని అయితే కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు ప్రజలకు సూచించారు. అధికారులు కూడా వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. శనివారం సాయంత్రం రెవెన్యూ మీటింగ్ హల్‌లో జిల్లాలో కురుస్తున్న వర్షాలపై, వచ్చే రబీ సిజన్‌కు సన్నద్దంపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులు హజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పెద్దగా నష్టమేమి జరగలేదని అయితే జిల్లాలో 42 ఇళ్లు నెలమట్టం అయ్యాయని, 923 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఒకరు చనిపోయారని వెల్లడించారు. భారీ వర్షాలకు 13 చెరువులకు గండ్లు పడి తెగిపోయాయని పెర్కోన్నారు. ఇది ఇలా ఉండగా వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జిల్లా వ్యాప్తంగా 2140 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని నిబందనాల మేరకు వారికి అందించాల్సిన పరిహారాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. పంచాయతీరాజ్ రోడ్లు 243 కిలో మీటర్లు దెబ్బతినగా ఆర్‌అండ్‌బి రోడ్లు మరో 200 దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో పలు ప్రాజెక్టుల లిఫ్ట్‌లను ప్రారంభించడం జరిగిందని ఈ ప్రాజెక్టుల ద్వారా 150 చెరువులను నింపామని వర్షాల ద్వారా 350 చెరువుల్లోకి నీరు వచ్చి చేరిందని మిషన్ కాకతీయ లాభం ఈ చెరువులు నిండడంతో తెలిందన్నారు. జిల్లాలో అదనంగా ఈ ఏడాది 4లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చిందన్నారు. రాబోయే రబీ సీజన్‌కు జిల్లా రైతాంగాన్ని సిద్ద్ధం చేస్తున్నామని అందుకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో ఎంపి జితేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ టికె శ్రీదేవి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్, బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఆర్‌ఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

కవులు, రచయితల్లో మార్పు రావాలి
* జాయింట్ కలెక్టర్ రాంకిషన్
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 24: మహబూబ్‌నగర్ జిల్లా పట్ల కవులు, రచయితల ఆలోచన సరళిలో మార్పు రావల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ రాంకిషన్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కరువు జిల్లా కాదని వనరులను సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల వెనుకబడిన జిల్లాగా మారిందని ఆయన అన్నారు. శనివారం ఆయన జడ్చర్లలోని బి ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పిజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సాహితి సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా జెసి రాంకిషన్ మాట్లాడుతూ కవులు, రచయితలు జిల్లాను కరువు జిల్లాగా అభివర్ణించడం పరిపాటిగా మారిందని అయితే ఈ రచన దృక్పథంలో మార్పు రావల్సిన అవసరం ఉందని, ఐక్యమత్యంతో ఉండి సమస్యను పరిష్కరించుకుని ఉండి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదన్నారు. జిల్లాలో అనేక అంశాల్లో ముందంజలో ఉందని ముఖ్యంగా పాడి పరిశ్రమలో మొదటి స్థానంలో ఉన్నామని జిల్లాలో 179 కిలో మీటర్లు కలిగిన జాతీయ రహదారి 200 కిలో మీటర్ల నది పరివాహక ప్రాంతం, బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్, విమానాశ్రయం వంటి సదుపాయాలు ఉన్నాయని అన్నారు. కొడంగల్ పప్పుదినుసులకు, నారాయణపేట, గద్వాల పట్టుచీరలకు ప్రసిద్ది అని ఇలా అన్ని రంగాల్లో జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భక్తవత్సల్‌రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ మద్ది అనంతరెడ్డి, సెక్రెటరీ నటరాజ్, ప్రొఫెసర్లు సురేష్, జగధీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జైల్‌భరోకు పోటెత్తిన జనం
* డిపోకే పరిమితమైన బస్సులు
* జిల్లాకై ఏకమైన రాజకీయ పక్షాలు
* రెండవ రోజు సకలజనుల బంద్ విజయవంతం
* స్థంభించిన జనజీవనం
గద్వాల, సెప్టెంబర్ 24: మహబూబ్‌నగర్ జిల్లా నడిగడ్డలోని గద్వాలను జోగులాంబ పేరిట జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు సకలజనుల బంద్ రెండవ రోజు విజయవంతమైంది. రెండవ రోజు శనివారం జైల్‌భరో కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఆర్టీసీ డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. మూడు రోజుల బంద్‌లో రెండు రోజులు దిగ్విజయంగా ముగిసింది. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో సామాన్యజనం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా దుకాణాలు, హోటళ్లు మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం కూడ సకలజనుల బంద్ కొనసాగనున్నది. జనంలో గూడుకట్టుకున్న జిల్లా ఆకాంక్ష మూడురోజుల బంద్‌లో స్పష్టంగా కనిపిస్తున్నది. స్వచ్ఛందంగా ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, సంఘాలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి తమ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. వాణిజ్య, వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్ చేసి జిల్లా ఆకాంక్షను తెలుపుతున్నారు. శనివారం కూడ దుకాణాలు, పెట్రోల్‌బంక్‌లు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. గ్రామగ్రామాన రోడ్లపై మానవహారాలు, రాస్తారోకోలతో జిల్లా ఏర్పాటు చేయాలని నినదిస్తున్నారు. ధరూరు, గట్టు, మల్దకల్, అయిజ, అలంపూర్, శాంతినగర్, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లోని జెఎసిలు ఎక్కడికక్కడే జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ల ముందు బైరాయించారు. ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో నడిగడ్డ ప్రజల ఆకాంక్షను బుట్టదాఖలు చేస్తున్నదని తమను అరెస్టు చేయాలని స్వచ్ఛందంగా పోలీస్‌స్టేన్లకు వెళ్లారు. పోలీసులు వారిని అక్కడికక్కడే అరెస్టు చేసి స్వంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. గద్వాలలో నిర్వహించిన జైల్‌భరో కార్యక్రమానికి కాంగ్రెస్, టిఆర్‌ఎస్, జెఎసి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టణంలోని ఎన్‌జిఓ భవనం నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలోని టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. జై గద్వాల జిల్లా అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంత మారుమ్రోగింది. అనంతరం అందరిని అరెస్టు చేసి స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. గద్వాల జిల్లా ఆకాంక్షను ప్రజలు బహిర్గతం చేస్తూ ఉద్యమానికి కలిసి వస్తుండడంతో బద్దశత్రువులుగా ఉన్న రాజకీయ పార్టీలు సైతం కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా నడిగడ్డలో పచ్చిగడ్డివేస్తే భగ్గుమనే విధంగా ఉన్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సైతం ఒకే వేదికపైకి వచ్చి జై గద్వాల జిల్లా అంటూ నినదించాయి. ఎంపిపి సుభాన్ దీక్షకు కాంగ్రెస్ నేతలు, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు వీరభద్రప్ప, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, గడ్డం కృష్ణారెడ్డి, బండల పద్మావతి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గంజిపేట రాములు, మున్నబాష, అతికూర్హ్రెమాన్, భీమన్న, మధుసూదన్‌బాబు, బాలగోపాల్‌రెడ్డి, ఇస్మాయిల్, రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జూరాలకు 1.26 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
* శ్రీశైలంకు 8 గేట్ల ద్వారా నీరు విడుదల
ధరూరు, సెప్టెంబర్ 24: ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుండి జూరాలకు 1,26,000 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లో రూపంలో వస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. శనివారం ఆల్మట్టి జలాశయానికి 29,057 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆల్మట్టిలో మూడు క్రస్ట్‌గేట్లను ఎత్తి 56,700 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ డ్యాంకు వదులుతున్నట్లు చెప్పారు. ఆల్మట్టి డ్యాంలో 519.060 నీటిమట్టం ఉండగా, 492.010 టిఎంసిల నీటిని నిల్వ ఉంచినట్లు అధికారులు తెలిపారు. నారాయణపూర్ జలాశయానికి 52,340 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. నారాయణపూర్ డ్యాం నుండి 8 గేట్లను ఎత్తి 60,720 క్యూసెక్కుల నీటిని జూరాల ప్రాజెక్టుకు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యాంలో 492.060 నీటిమట్టం ఉంది. 32.283 టిఎంసిల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు చెప్పారు. జూరాల ప్రాజెక్టుకు నదిపరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో పాటు కాగ్నా, బీమా నదులతో పాటు కృష్ణానదికి వస్తున్న వరద నీరు రూ.1.26 లక్షల క్యూసెక్కులుగా ఉందని వారు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 83,904 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాయానికి విడుదల చేస్తున్నట్లు పిజెపి అధికారులు తెలిపారు. 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళా శక్తి పొదుపుకే పరిమితం కారాదు
* బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి * ప్రతి మహిళా మొక్కలు నాటాలి
* ప్రతి ఇంటిలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలి * మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, సెప్టెంబర్ 24: జనాభాలో సగ భాగమైన మహిళల శక్తి చాలా గొప్పదని, ఆ శక్తిని కేవలం పొదుపుకే పరిమితం చేయకుండా బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం వనపర్తిలో నిర్వహించిన మహిళా సంఘ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, అలాగే మొక్కలు నాటడానికి కూడా ముందుకు రావాలన్నారు. మొక్కల కోసం గుంతలు తీసిన నాటి నుండి పెరిగి పెద్ద అయ్యే వరకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నదన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.12వేలు ఇస్తున్నదని, ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. అలాగే పడిన ప్రతి చినుకు భూమిలోకి ఇంకేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దీని వల్ల భూగర్భజలాలు పెరిగి పాడిపంటలు సంమృద్ధిగా ఉంటాయన్నారు. అలాగే విద్యాభ్యాసంలో కూడా మహిళలు ముందుండాలని అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో మహిళలు ముందుండాలని, రాణి రుద్రమ్మ దేవి ఆనాడే ముందున్నదని, ఇందిరా గాంధీ లాంటి మహానేతలు దేశాన్ని పాలించారని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. నియోజకవర్గంలో 50వేలకు పైగా మహిళా సభ్యులు ఉన్నారని, ప్రతి మహిళా కుటుంబంలో ఎంత మంది ఉంటే అన్ని మొక్కలను నాటి పెంచాలని అన్నారు. దీంతో 5లక్షల మొక్కలు నాటినట్లు అవుతుందన్నారు. వర్షాలు పడుతున్నాయని మొక్కలు నాటితే నీటి సమస్య ఉన్నదని ఒకవేళ వర్షం రాకపోయిన ట్యాంకర్ల ద్వారా నీటిని సరపరా చేయిస్తామన్నారు. సమావేశంలో డిఆర్‌డిఎ పిడి మధుసూదన్ నాయక్, డ్వామా పిడి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపి డాక్టర్ మంధ జగన్నాథం, ఎంపిపిలు శంకర్ నాయక్, కృష్ణానాయక్, మున్సిపల్ ఛైర్మన్ రమేష్‌గౌడ్, మాజీ ఛైర్మన్ లక్ష్మయ్య, నాయకులు వాకిటి శ్రీ్ధర్, లోక్‌నాథ్ రెడ్డి, ప్రేమ్ కుమార్, యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులూ.. ఖబర్దార్
* కదం తొక్కిన వేలాది మంది విద్యార్థులు * మానవహారంతో అంతర్‌రాష్ట్ర రహదారిపై కొవ్వొత్తుల ప్రదర్శన
మక్తల్, సెప్టెంబర్ 24: నిద్రిస్తున్న భారత సైనిక సింహాలపై జైషే మహ్మద్ ఉద్రవాద పిరికిపందలు దాడిచేసి 18 మంది భారత సైన్యం మృతికి కారణమైన పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల్లారా ఖబర్ధార్ అంటూ వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ సభ్యులు కదంలో కదం వేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి అంతరాష్ట్ర రహదారిని మానవహారంతో దిగ్భందం చేశారు. శనివారం మండల కేంద్రంలోని మక్తల్ పట్టణంలో శ్రీసాయి చైతన్య జూనియర్ కళాశాల, సివిరామన్ డిగ్రీ కళాశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు కళాశాల కరస్పాండెంట్ బ్రహ్మానందరెడ్డి, ప్రిన్సిపల్ జైపాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో అమరవీరులకు అశ్రునివాళులు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈనేపథ్యంలో అంతరాష్ట్ర రహాదరిపై దాదాపు గంటన్నరపాటు మానవహారం చేపట్టి గాయపడిన భారత జవాన్లు త్వరగా కోలుకోవాలని క్రొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈసందర్భంగా బ్రహ్మానందరెడ్డి, జైపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ భారతదేశ తలమానిక ప్రాంతమైన కాశ్మీర్‌లోని యూరిలోగల భారత సైనిక స్థావరాల్లో నిద్రిస్తున్న భారత సైనిక సింహాలపై పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాద మూకలు దాడిచేయడం పిరికిపంద చర్యఅంటూ వారు మండి పడ్డారు. పాకిస్తాన్ భారత్‌పై యుద్ధానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో భారతదేశాంలోని ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద, కుల,మత, ప్రాంతీయ బేదాలు లేకుండా పాకిస్తాన్ దుండగుల అరాచకాలను అణచివేయడానికి కలసికట్టుగా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. నహీకిసీకా బాప్‌కా పాకిస్తాన్ భారత్‌కా అంటూ విద్యార్థులు మధ్యమధ్యలో నినదించడంతో మక్తల్ పట్టణం దద్దరిల్లింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు, వాటి సంస్థలకు ప్రోత్సహం అందిస్తున్న వారెవరైనా ఈదేశం నుండి వారిని తరిమి కొట్టాలని అన్నారు. తమ విద్యార్థుల ఉమ్మిలి వేస్తే కొట్టుకుపోయే పాకిస్తానీలు భారతదేశంలోని వారందరు తెగించి ఎదిరిస్తే చీమల్లా నలిగిపోక తప్పదని అన్నారు. ఇప్పటికైనా అందరం గుర్తించి వీరమరణం పొందిన 18 మది భారత జవాన్ల కుటుంబాలను ఆధుకునేందుకై ముందుకు రావాలనీ విద్యార్థి లోకం నినదించారు. కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ప్రధానకార్యదర్శి అంజయ్య ఆచారి, శ్రీగీతం కరస్పాండెంట్ వెంకటేష్, డివిఎం హెచ్‌ఎం కర్నిస్వామి, కళాశాల సిబ్బంది నరేందర్, వెంకటేశ్వర్లు, బుగ్గన్న, రవికుమార్‌రెడ్డి, క్రిష్ణకుమార్‌రెడ్డి, మల్లేష్, దశరత్, క్రిష్ణ, మహేష్, సందీష్, సంజీవ్ పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
* పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి
ఊట్కూర్, సెప్టెంబర్ 24: జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారనికి ఎళ్లవేళల కృషి చేస్తానని తెలంగాణ పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం ఊట్కూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమావేశంలో అయన అతిథిగా హజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు పూర్తి సహయం చేస్తానని అన్నారు. 2017లో జరిగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొటి చేసేందుకు నాకు ఓట్లు వేసి గెలుపించాలని ఉపాధ్యాయులను కోరారు. పాలమూరు జిల్లా వాసిగా గెలిచి తమ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన హమి ఇచ్చారు. పాలమూరు జిల్లాలో పర్యటిస్తునందున కొన్ని పాఠశాలలో విద్యార్థులకు మరుగుదోడ్లు లేవని ఆయన అవేధన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో 2048 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళిగా ఉన్నాయని వేంటనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 2014-2016 వరకు ఉర్దూ మిడియం పాఠశాలలు మూతపడడంతో రాష్ట్రంలోని ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి 76 మంది విద్యా వాలంటరిలను నిర్మించి 24 పాఠశాలలు నడిపించిన ఘనత తెలంగాణ పిఅర్‌టియుకు దక్కిందని అన్నారు.
బయెమెట్రిక్ విధానాన్ని విధించడంతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పాతాయని బయెమెట్రిక్ విధనాన్ని ఉపాధ్యాయ సంఘం పూర్తి వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. కళాశాల ఉపాధ్యాయులకు కాంట్రాక్ట్ పోస్టులను క్రమభద్దికరుణ చేయాలని అయన ప్రభుత్వనికి డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హమీలు ఇచ్చిన నేటి వరకు నేరవేర్చలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బాల్‌రాజ్, జనార్ధన్‌రెడ్డి, రఘురాంగౌడ్, సుధాకర్, శ్రీనివాస్, జగన్నాథ్‌రావు, గోపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దత్తత జిల్లాపై బాబుకు ఎందుకింత కక్ష?
* మార్చి నాటికి వాటర్‌గ్రిడ్ ద్వారా మంచినీటి సరఫరా * విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24: దత్తత జిల్లాపై చంద్రబాబుకు ఎందుకు కక్ష అని సమైఖ్య రాష్ట్రంలో కేవలం జిల్లా కేంద్రంగా ఎత్తిచూపి వలసలను చూపి అయ్యో తాము దత్తత తీసుకుని అభివృద్ద్ధి చేస్తామని గొప్పలు చెప్పారే తప్పా. చేసింది శూన్యమని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని ప్రధాన రోడ్డు మార్గాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలోని జడ్చర్ల, రాయిచూర్ వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉందని దీనిని వెడల్పు చేయడానికి రూ.40కోట్ల ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో ఈ రోడ్డును అభివృద్ధి పరిచి జిల్లా కేంద్రాన్ని సుందరవందనంగా రోడ్డు ద్వారానే ఆదర్శంగా ఉండడానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించిన పాలమూరు మాత్రం అబివృద్దికి నోచుకోలేదని ఆరోపించారు. పాలమూరు పర్యటనకు వచ్చిన సమైఖ్య రాష్ట్రంలోని ప్రతి ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకుని ప్రకటనలు గుప్పించారు తప్పా. చేసింది శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధ్దికి అడుగులు పడుతుందని పాలమూరుకు రూ.96కోట్లతో బైపాస్ రోడ్డు రావడం ఈ పట్టణ అభివృద్ధ్దికి మరింత ముందడుగు పడిందన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయని పరిపాలన సౌలభ్యం అభివృద్ధ్దికి నాంది కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జిల్లాలు ఏర్పడ్డ తర్వాత కూడా మహబూబ్‌నగర్ ఇతర జిల్లాలకు తల్లి, పెద్దన్న పాత్ర పోషిస్తుందన్నారు.నాగిరెడ్డిపల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉండబోతుందని దాంతో మహబూబ్‌నగర్‌కు ఎలాంటి నీటి ఇబ్బందులు ఉండవని మూడు నాలుగు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న అడ్డంకులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి విజయం సాదించిన ముఖ్యమంత్రికి పాలమూరు జిల్లా ప్రజల తరపున ప్రత్యేకంగా రుణపడి ఉంటున్నామని తెలిపారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి నాయకులు జిల్లాను పూర్తిగా విస్మరించారని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కన్నా వెనుకల శంకుస్థాపనలు చేసిన ఆంధ్ర, రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని ఇక్కడ మాత్రం విస్మరించారన్నారు. విలేఖరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, తెరాస నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, శివకుమార్, సుదిప్‌రెడ్డి, నాని, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగంలో సమూల మార్పులు
జడ్చర్ల, సెప్టెంబర్ 24: సమైక్యంధ్ర పాలనలో బూజు పట్టిపోయిన విద్యా రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఆ రంగంలో సమూలమైన మార్పులు తెచ్చి బావి భారత పౌరులకు ఉపయోగపడే విధంగా విద్యారంగాన్ని మార్చేందుకోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్లలోని కాటన్ మార్కెట్ ఆవరణలో నిర్వహించిన సిఎన్‌ఆర్ ఫౌండేషన్ కోచింగ్ ముగింపు సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అమలు చేసిన విద్యా విధానం లోప భూయిష్టంగా ఉందని, అందువల్లే విద్యారంగం అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని, అందుకోసమే రాష్ట్రంలో అనేక రకాలైన గురుకుల విధ్యాలయాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో కేవలం 200గరుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ముఖ్యమంత్రి కృషి వల్ల ఆసంఖ్య వేల స్థాయికి చేరిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎర్పాటైన గురుకుల విధ్యాలయాల్లో అన్ని వర్గాల విధ్యార్థిని, విధ్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషికి చేదోడు,వాదోడుగా సహకారం అందించి ఈ ప్రాంతంలోని నిరుద్యోగ విధ్యార్థిని, విధ్యార్థులకు అండగా నిలవాలని సిఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని పలు సంస్థల సహకారంతో రెండు నెలలుగా ఉచిత శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఈ శిబిరంలో పాల్గొన్న అభ్యర్థులు ఉద్యోగాలు సంపాందించి సమాజానికి తమ వంతు తోడ్పాటు అందించాలన్నారు. ఎంపి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతో వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సిఎన్‌ఆర్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని అభ్యర్థులకు శిక్షణను ఇవ్వడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జడ్చర్ల, నవాబుపేట, మిడ్జిల్ ఎంపిపిలు లక్ష్మి,శీనయ్య,దీపారెడ్డి,జడ్చర్ల,బాలానగర్ జడ్పీటిసిలు జయప్రద,ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శోభ, సీఎన్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు జగన్, వెంకట్‌రెడ్డి, హెటిరో ప్రతినిధి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

బండర్‌పల్లి మహిళల దీక్ష
దేవరకద్ర, సెప్టెంబర్ 24: నూతన మండలాల ఏర్పాటు భాగంగా బండర్‌పల్లి గ్రామాన్ని దేవరకద్ర మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ శనివారం గ్రామానికి చెందిన మహిళలు నిరాహార దీక్షకు దిగారు. గత ఆరు రోజులుగా గ్రామస్థులు చేపడుతున్న దీక్షల్లో భాగంగా మహిళలు సైతం దీక్ష శిబిరానికి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇంటికో వ్యక్తి ఇదివరకే కలెక్టరేట్ వరకు జిల్లాలోనే మొదటిసారిగా తమ గ్రామాన్ని తమకు అనుకూలం ఉన్న మండలంలో కలపాలంటూ బండర్‌పల్లి గ్రామస్థులే మొదట డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ స్పూర్తితో జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రామాలను మండలాల్లో చేర్చలంటూ గత నెల రోజుల క్రితం నుండి ఆందోళన చేపట్టారు. అయితే బండర్‌పల్లి గ్రామస్థులు ప్రతినిత్యం కలెక్టరేట్‌కు, సంబందిత అధికారులకు, ఎంపి, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందిస్తూ చివరగా గ్రామంలోనే దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ మాట్లాడుతూ తమ గ్రామాన్ని దేవరకద్ర మండలంలో కలపాలని డిమాండ్ చేశారు. దీక్షలో అంగన్‌వాడీ కార్యకర్తలు సుకన్య, రాణీ, సావిత్రమ్మ, బాలమ్మ, వెంకటమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు.