S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్రామాలతోనే దేశాభివృద్ధి

వడ్డేపల్లి, సెప్టెంబర్ 24: గ్రామీణ ప్రజల అవసరాలు తెలుసుకుని వారికి సహాయం చేయడం, గ్రామాల అభివృద్ధికి తోడ్పడడమే నిజమైన సేవ అని హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు అన్నారు. శనివారం వరంగల్ జిల్లా న్యాయస్థాన భవన సముదాయంలో బాల వికాస సుజల్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల వికాస కార్యక్రమాల ద్వారా ఎన్నో గ్రామాలు, ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని కొనియాడారు. కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ పథక ఫలితాన్ని బట్టి జిల్లాలోని ఇతర కోర్టులలో కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోర్టుకు వచ్చే ఎంతో మందికి ఈ పథకం లాభదాయకంగా ఉంటుందని వివరించారు. అధునిక పరిజ్ఞానంతో, పరిశుభ్రమైన శుద్ధ నీటిని ఒక్క రూపాయికే అందించడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. బాల వికాస సంస్థ డైరెక్టర్ శౌరిరెడ్డి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా 750 గ్రామాలలో వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేసి, మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో కేవలం రెండు రూపాయలకే నీటి అందజేయడం జరుగుతుందని వివరించారు. నగరంలోని బాటసారుల నీటి అవసరాలను తీర్చడానికి సుజల్ పథకాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పథకానికి నీటిని అందించడానికి వడ్డేపల్లి చెరువువద్ద గంటకు 6000 సామర్థ్యం కలిగిన వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయమూర్తి లక్ష్మణ్, బాల తెరిసా జింగ్రాస్, నగర కమీషనర్ సర్పరాజ్ అహ్మద్, సిపి సుధీర్‌బాబు, బార్‌కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.